వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది: వివరణ ఇవ్వండి, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ/చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఆ రాష్ట్ర మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర ప్రభుత్వం జయలలిత మరణించక ముందు చివరి రోజుల్లో ఏం జరిగింది నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

జయలలిత మృతి మిస్టరీ వీడేనా: విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వం, శశికళ బెదిరించారు!జయలలిత మృతి మిస్టరీ వీడేనా: విచారణ కమిషన్ వేసిన ప్రభుత్వం, శశికళ బెదిరించారు!

తమిళనాడు ఇన్ చార్జ్ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ ను నివేదిక పంపించాలని కేంద్ర ప్రభుత్వం సూచించిందని తెలిసింది. గవర్నర్ విద్యాసాగర్ రావ్ తమిళనాడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీని నివేదిక ఇవ్వాలని సూచించారని సమాచారం. చెన్నై చేరుకున్న గవర్నర్ విద్యాసాగర్ రావ్ తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులను గమనిస్తున్నారు.

Centre to seek explanation from TN govt on Jayalalithaas final days

తమిళనాడులో రాజకీయ పరిస్థితులు గందగోరళంగా తయారు కావడంతో గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్ రావ్ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పుడు కేంద్ర హోం శాఖకు సమాచారం ఇస్తున్నారని తెలిసింది. జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో మంత్రులు ఒక్కరు కూడా ఆమెను చూడలేదని తమిళనాడు అటవి శాఖ మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ ఇటీవల చెప్పారు.

జయలలితకు చికిత్స: వీడియో, ఫోటోలు ఉన్నాయి, విచారణ కమిటీకి ఇస్తాం: మన్నార్ గుడి!జయలలితకు చికిత్స: వీడియో, ఫోటోలు ఉన్నాయి, విచారణ కమిటీకి ఇస్తాం: మన్నార్ గుడి!

తనతో పాటు మంత్రులు అందరూ ఆసుపత్రిలో అమ్మ జయలలితను చూశామని మరో మంత్రి సెల్లూరు కే. రాజు మంగళవారం బాంబు పేల్చేరు. ఈ విషయం మొత్తం గమనించిన కేంద్ర ప్రభుత్వం జయలలిత చివరి రోజుల్లో ఏం జరిగింది ? అంటూ పూర్తి సమాచారంతో నివేదిక ఇవ్వాలని తమిళనాడు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.

English summary
The last days of former chief minister J Jayalalithaa almost on a daily basis, the central government will seek an explanation from the AIADMK government in Tamil Nadu, according to sources.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X