వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం: వలసకూలీల కోసం ఏం చర్యలు తీసుకున్నారు..?

|
Google Oneindia TeluguNews

వలసకూలీల వెతలపై సర్వోన్నత న్యాయస్థానం స్పందించింది. తమ సొంత ఊరికి వెళ్లేందుకు కూలీలు కాలినడకన, ట్రక్కుల్లో వెళుతోన్న విదారకర దృశ్యాలు.. మీడియాలో చూస్తున్నామని, పత్రికల్లో చదువుతున్నామని పేర్కొన్నది. లక్షలాది మంది వలసకూలీల సమస్యలపై సంబంధించి వార్తా పత్రికల కథనం ఆధారంగా సుమోటోగా కేసు విచారణకు స్వీకరించింది. వలసకూలీలు రవాణా సౌకర్యం కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది.

7 వారాల్లోనే వైరస్ నిర్మూలన, 700 నుంచి 30కి తగ్గిన కేసులు, లాక్‌డౌన్ ఎత్తివేత..7 వారాల్లోనే వైరస్ నిర్మూలన, 700 నుంచి 30కి తగ్గిన కేసులు, లాక్‌డౌన్ ఎత్తివేత..

జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఎంఆర్ షా నేతృత్వంలోని ధర్మాసనం.. పిటిషన్‌ను మంగళవారం విచారించింది. వలసకూలీలకు వెంటనే రవాణా, ఆహారం, వసతి సదుపాయం కల్పించాలని ఆదేశాలు జారీచేసింది. ఈ రోజుకు కూడా వలసకూలీల సమస్య ఉంది అని గుర్తుచేసింది.

Centre, states are lapses for migrants: SC

లాక్ డౌన్ ఉన్న సందర్భంగా వలసకూలీల సమస్యలను పట్టించుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని చెప్పారు. వలస కార్మికులను ఆదుకునేందుకు ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఆదేశించింది. సొంత గ్రామాలకు వెళ్లే క్రమంలో కూలీలు మృత్యువాత పడుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధర్మాసనం ఆందోళన వ్యక్తం చేసింది.

English summary
Taking suo motu cognisance of the plight of lakhs of stranded migrant workers across the country, the Supreme Court.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X