వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

lockdown:లిక్కర్ షాపులు ఓపెన్ చేయడంతో ఆదాయం.. రాష్ట్రాల వినతికి కేంద్రం ఓకే...

|
Google Oneindia TeluguNews

కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపించింది. దీంతో ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దుతూనే.. లాక్‌డౌన్ సడలింపులను ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రెడ్ జోన్ తప్ప ఆరంజ్, గ్రీన్ జోన్లలో సడలింపులతో ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇవ్వొచ్చని భావించింది. ఇప్పటికే తమకు ఆర్థిక ప్రోత్సాహం అందించాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇప్పటికే పంజాబ్ ముఖ్యమంత్రి అమరిందర్ సింగ్ కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. మద్యం షాపులను తెరిచేందుకు తమకు అనుమతి ఇవ్వాలని కోరారు. మద్యం షాపులు మూసివేయడం వల్ల నష్టపోతున్నామని కర్ణాటక కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెల్లింది.

ప్రభుత్వాల విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కంటోన్మైంట్ జోన్లు తప్ప మిగతా చోట్ మద్యం షాపులను తెరిచేందుకు కేంద్ర హోంశాఖ అనుమతి ఇచ్చింది. కానీ సామాజిక దూరం మాత్రం పాటించాలని తేల్చిచెప్పింది. మద్యం, పాన్ గుట్కా, బీడీ దుఖాణాలు ఆరు అడుగుల దూరంలో ఉండాలని స్పష్టంచేసింది. అలాగే ఐదుగురు కంటే ఎక్కువమంది లైన్‌లో ఉండొద్దని సూచించింది. మద్యం అమ్మకాలతో కేంద్ర, రాష్ట్ర ఖజానాకు నగదు చేరనుంది. ఇక గ్రీన్, ఆరంజ్ జోన్లలో అన్ని ఆంక్షలను ఎత్తివేశామని హోంశాఖ పేర్కొన్నది. అయితే విమాన, రైలు, విద్యాసంస్థలు, సినిమా హాల్లు, మాల్స్ మూసివేస్తామని పేర్కొన్నది.

Centre Takes Revenue Loss Plea of States into Account, Allows Liquor Shops..

గ్రీన్, ఆరంజ్ జోన్లలో 33 శాతం సిబ్బంది కార్యాలయాలు కూడా పనిచేసేందుకు అనుమతిచ్చింది. కానీ సెలూన్లు, హోటళ్లు, రెస్టారెంట్లను రెడ్ జోన్ పరిధిలో ఇప్పటికీ అనుమతించలేదు. కంటైన్మైంట్ జోన్లు కానీ ప్రాంతాల్లో చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, దుకాణాలను అనుమతిచ్చారు. దీంతో ఆర్థిక వ్యవస్థ మేలు చేకూరుస్తోందని కేంద్రం భావిస్తోంది.

English summary
Most state governments had demanded an economic booster from the central government. Punjab Chief Minister Amarinder Singh had written to the Union Home Ministry requesting opening up of liquor shops.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X