వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రీన్ ట్యాక్స్‌కు కేంద్రం ఆమోదం..?: 8 ఏళ్లు పైబడిన వాహనాలకు రోడ్ ట్యాక్స్ వడ్డన..

|
Google Oneindia TeluguNews

పాత వాహనాలపై గ్రీన్ ట్యాక్స్ విధించే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఎనిమిదేళ్లు ఆపై బడిన రవాణా వాహనాలకు చెల్లించే రోడ్ ట్యాక్స్‌లో 10 నుంచి 25 శాతం హరిత పన్ను కింద చెల్లించే విధంగా కేంద్రం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ పునరుద్ధరణ సందర్భంగా పన్ను వసూలు చేయొచ్చని తెలుస్తోంది. వ్యక్తిగత వాహనాలు కొనుగోలు చేసిన పదిహేనేళ్ల తరువాతే ఈ పన్ను వర్తించనుంది. ప్రభుత్వ ప్రజారవాణా వాహనాలపై మాత్రం కేంద్రం కొంత తక్కువ మొత్తంలోనే పన్ను వసూలు చేయనుంది.

కాలుష్య పూరిత నగరాల్లో గ్రీన్ ట్యాక్స్ ఏకంగా 50 శాతం వరకూ ఉండొచ్చని తెలుస్తోంది. వాహనం ఏ కరమైనది, ఎటువంటి ఇంధనం వినియోగిస్తోందనే అంశాల వారీగా కూడా పన్ను చెల్లింపుల్లో మార్పులు ఉంటాయి. హైబ్రీడ్, ఎలక్ట్రికల్, ప్రత్యామ్నాయ ఇంధనాలు వినియోగించే వాహనాలకు మాత్రం మినహాయింపు ఇచ్చేందుకు కేంద్రం నిర్ణయించింది.

Centre to impose green tax on older vehicles

Recommended Video

Ration Delivery Vehicles In AP: AP CM YS Jagan Flags Off 9260 Vehicles | Oneindia telugu

వ్యవసాయానికి అనుబంధంగా ఉండే ట్రాక్టర్లు, హార్వెస్టర్లు, టిప్పర్లకు కూడా ఇది వర్తిస్తుంది. ఈ ముసాయిదా ప్రతిపాదనలను కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాల కోసం పంపించింది. అభిప్రాయ సేకరణ పూర్తయిన అనంతరం ప్రభుత్వం దీన్ని నోటిఫై చేస్తుంది. ఈ ప్రతిపాదనలకు కేంద్రం రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోదం తెలిపారు.

English summary
central government has also proposed higher tax for vehicles registered in highly polluted cities.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X