వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లేహ్, జమ్మూకాశ్మీర్‌లను చైనాలో చూపిన ట్విట్టర్: కంపెనీ సీఈఓకు భారత్ హెచ్చరిక

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇటీవల జమ్మూకాశ్మీర్ తోపాటు లేహ్(లడఖ్)లను చైనా భూభాగంలో చూపిన ట్విట్టర్‌కు భారత ప్రభుత్వ తీవ్ర హెచ్చరికలు చేసింది. లడఖ్, జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, వాటిని ఇతర దేశంలో చూపడం ఏంటని నిలదీసింది. ఇలాంటి పొరపాట్లను సహించబోమని తేల్చి చెప్పింది.

భారతదేశ అధికారిక చిత్రపటాన్ని తప్పుగా ఎలా చూపేడతారని ట్విట్టర్ సీఈఓ జాక్ డెర్సీకి కేంద్ర ప్రభుత్వం రాసిన తన లేఖ అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని హెచ్చరించింది. ట్విట్టర్ కంపెనీ భారత పౌరుల మనోభావాలను గౌరవించాల్సిందేనని స్పష్టం చేసింది.

Centre Warns Twitters CEO After It Misrepresents Indias Map, Shows Leh & J&K In China

కేంద్రపాలిత ప్రాంతం లడఖ్‌లోని లేహ్‌ను ఇటీవల ట్విట్టర్ జియో లోకేషన్.. చైనాలో భూభాగంగా చూపింది. లేహ్ లడఖ్‌లోనే అతిపెద్ద నగరం. ఈ క్రమంలో "భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని, సమగ్రతను అగౌరవపరచడం, ఇది పటాల ద్వారా కూడా ప్రతిబింబిస్తుంది, ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు, అంతేగాక, "చట్టవిరుద్ధం"అని ట్విట్టర్ కంపెనీకి స్పష్టం చేసింది.

ఇలాంటి పునరావృతమైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. .. ఇటువంటి ప్రయత్నాలు ట్విట్టర్‌కు అపఖ్యాతిని కలిగించడమే కాక, మధ్యవర్తిగా దాని తటస్థత, సరసత గురించి ప్రశ్నలను కూడా లేవనెత్తుతున్నాయని ఐటి కార్యదర్శి అజయ్ సాహ్నీ లేఖలో పేర్కొన్నారు.

కాగా, గత ఆదివారం లేహ్‌ను చైనాలో భూభాగంగా చూపిన ట్విట్టర్.. సోమవారం లేహ్‌ను జమ్మూకాశ్మీర్‌లో ప్రాంతంగా చూపింది. ఇవి రెండు కూడా తప్పులేదు. ఎందుకంటే, ఆర్టికల్ 370 రద్దు తర్వాత జమ్మూకాశ్మీర్, లడఖ్‌లను వేర్వేరు కేంద్రపాలిత ప్రాంతాలుగా కేంద్ర విభజించింది. ఇక లేహ్ ఇప్పుడు లడఖ్‌లో అతిపెద్ద నగరంగా ఉంది.

నేషనల్ సెక్యూరిటీ అనలిస్ట్ నితిన్ గోఖలే ట్విట్టర్ లైవ్‌లో మాట్లాడుతున్న సమయంలో ఆయన ఉన్న ప్రాంతం(లేహ్(లడఖ్), జమ్మూకాశ్మీర్) చైనాలో చూపడంతో పెనుదుమారం రేగింది. ఇలాంటి జరుగుతుంటే ప్రభుత్వం స్పందించదా? అని ఇప్పటికే ప్రతిపక్షాలు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా, ట్విట్టర్‌కు హెచ్చరికలు జారీ చేసింది.

English summary
Ladakh and Jammu and Kashmir are "integral and inalienable parts of India governed by the Constitution of India", the government told Twitter after the social media platform's location settings showed Leh as part of China, government sources said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X