వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎంపీలు క్షమాపణలు కోరితే సస్పెన్షన్ ఎత్తివేతపై పరిశీలిస్తాం: కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాజ్యసభలో సస్పెన్షన్‌కు గురైన ఎంపీ క్షమాపణలు కోరితే వారిపై వేటును తొలగించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుందని కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. రాజ్యసభలో మంగళవారం 8 మంది సభ్యులపై సస్పెన్షన్‌ను నిరసిస్తూ కాంగ్రెస్, టీఎంసీ సహా విపక్షాలు సభలను వాకౌట్ చేశాయి. ఈ క్రమంలో కేంద్రమంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాతో మాట్లాడారు.

సభ్యులు క్షమాపణలు కోరితే వారి సస్పెన్షన్ వేటును ఎత్తివేసేందుకు కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. ఇప్పటి వరకు ఓ కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో బల్లపైకి ఎక్కి బిల్లు ప్రతులను చించేసి చిందులు వేయడం తాము చూడలేదని అన్నారు.
విపక్ష సభ్యులు సభలో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించడంపై కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందని అన్నుకున్నాం.. కానీ అలా జరగలేదని అన్నారు.

Centre Will Consider Revoking Suspension Of MPs if They Apologise: Ravi Shankar Prasad

సభలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన ఎంపీలకు మద్దతుగా ట్వీట్లు చేయడంపై రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ పరోక్షంగా కేంద్రమంత్రి మండిపడ్డారు. విదేశాల నుంచి ట్వీట్లు రావడం.. ఎంపీలు ఈ విధంగా ప్రవర్తించడం.. ఇవేం రాజకీయాలో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని.. అందుకే ఆదివారం రాజ్యసభలో బిల్లులు ఆమోదం పొందాయన్నారు.

వ్యవసాయానికి సంబంధించి కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లులు ఆదివారం రాజ్యసభలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్య ఆమోదం పొందిన విషయం తెలిసిందే. కాగా, ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు నిరసన చేపట్టారు. కొందరు సభ్యులు డిప్యూటీ ఛైర్మన్ పోడియం వద్దకు వెళ్లి అనుచితంగా ప్రవర్తించారు. డిప్యూటీ ఛైర్మన్ వద్ద ఉన్న మైక్‌ను విరగ్గొట్టేందుకు ప్రయత్నించారు. పత్రాలను చించివేశారు. దీంతో 8 మంది ఎంపీలపై రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు సస్పెన్షన్ వేటు వేశారు. సస్పెన్షన్ కు వ్యతిరేకంగా మంగళవారం ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

English summary
The government will consider revoking the suspension of eight Rajya Sabha members only after they apologise for their behaviour in the Upper House, Union minister Ravi Shankar Prasad said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X