వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఆధార్ తప్పనిసరిపై వెనక్కి తగ్గిన కేంద్రం

ఆధార్ లింక్ పై గుడ్ న్యూస్ : వెనక్కి తగ్గిన కేంద్రం | Oneindia Telugu
న్యూఢిల్లీ: బ్యాంకు సేవలకు ఆధార్ కార్డ్ అనుసంధానం తప్పనిసరి చేయాలని తీసుకున్న నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గింది. ఆధార్ అనుసంధానం చేసుకునేందుకు డిసెంబరు 31 చివరి తేదీ. తాజాగా దానిని ఎత్తివేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
ఈ మేరకు ఓ గెజిట్ నోటిఫికేషన్ను బుధవారం విడుదల చేసింది. ఆధార్ అనుసంధానాన్ని వ్యతిరేకిస్తూ పలువురు సుప్రీం కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆ పిటిషన్లపై విచారణను సుప్రీం కోర్టు గురువారం చేపట్టనుంది.

ఈ నేపథ్యంలోనే బ్యాంకు సేవలకు ఆధార్ అనుసంధాన గడువును ఎత్తివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఎప్పటిలోగా ఆధార్ అనుసంధానం చేసుకోవాలనే దానికి సంబంధించిన కొత్త తేదీని త్వరలో ప్రకటించనున్నారు.