వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా భర్తే నేర్పించారు: బ్రేకింగ్‌గా చదివిన యాంకర్, నాలుగేళ్ల క్రితం తండ్రినీ..

తన భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివి విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన చత్తీస్‌గఢ్ టీవీ యాంకర్ సుప్రీత్ కౌర్ తండ్రి కూడా నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

|
Google Oneindia TeluguNews

రాయ్‌పూర్: తన భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివి విధి నిర్వహణలో అంకితభావం ప్రదర్శించిన చత్తీస్‌గఢ్ టీవీ యాంకర్ సుప్రీత్ కౌర్ తండ్రి కూడా నాలుగేళ్ల క్రితం ఓ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

తన భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోయినా సుప్రీత్ కౌర్ ఇటీవల ప్రొఫెషనలిజమ్ ప్రదర్శించిన విషయం తెలిసిందే. ఆమె అంకితభావానికి ఆమె ఛానల్ యాజమాన్యం, తోటి ఉద్యోగులే కాదు ప్రపంచమే నివ్వెరపోయింది. చైనా మీడియా ఆమెపై ప్రశంసలు కురిపించింది.

భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన యాంకర్: చైనా మీడియా ప్రశంసలు భర్త మృతిని బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన యాంకర్: చైనా మీడియా ప్రశంసలు

ఇంగ్లీష్ మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. నాలుగేళ్ల క్రితం సుప్రీత్ కౌర్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. సుప్రీత్ కౌర్ - ఆమె భర్తకు పిల్లలు ఉన్నారని మీడియాలో వార్తలు వచ్చాయని, కానీ అది వాస్తవం కాదంటున్నారు.

ఇదిలా ఉండగా చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్.. సుప్రీత్ కౌర్ భర్త మృతి పట్ల సంఘీభావం తెలిపారు. సుప్రీత్ అంకితభావాన్ని ఆయన ప్రశంసించారు.

సంతోషంగా ఉండటం నా భర్త నేర్పించారు

తన భర్తే తన జీవితం అని, సంతోషంగా ఎలా ఉండాలో ఆయనే తనకు చెప్పారని, తానే త్వరగా ఎవరితోను కలవనని, కానీ ఆయన తనను పూర్తిగా మార్చివేశారని సుప్రీత్ చెప్పారు.

ఆయనే తన జీవితం అయ్యారని, తాను చదివిన జర్నలిజంను ఎప్పుడూ అభినందిస్తూ ఉంటారని, ఈ కష్టసమయంలో తనకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు అని సుప్రీత్‌ కౌర్‌ అన్నారు.

విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్ విషయం తెలిసినా...: భర్త మృతినే బ్రేకింగ్ న్యూస్‌గా చదివిన న్యూస్ యాంకర్

సుప్రీత్‌కౌర్‌ ఈనెల 8వ తేదీన వార్తల బులిటెన్‌ చదువుతూ ఉండగా కారు ప్రమాదానికి గురైన బ్రేకింగ్‌ న్యూస్‌ వచ్చింది. కారులో ప్రయాణిస్తున్న ఐదుగురిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయినట్లు రిపోర్టరు చెప్పారు.

ఫోన్‌లో న్యూస్ ఛానెల్‌ రిపోర్టరు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారిలో తన భర్త కూడా ఉన్నాడనే విషయం కౌర్‌కు అర్థమైంది. కానీ ఉద్వేగానికి లోనుకాకుండా వృత్తి పట్ల ఆమెకున్న నిబద్ధత వల్ల బులిటెన్‌ను పూర్తిగా చదివింది.

English summary
Chhattisgarh TV anchor Supreet Kaur showed exemplary professionalism when she had to break the news of her husband's death in a road accident in Chhattisgarh on live TV.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X