వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గొలుసు దొంగతనానికి పదేళ్ల జైలు శిక్ష ! గుజరాత్ దొంగలు మైండ్ ఇట్

|
Google Oneindia TeluguNews

గొలుసు దొంగతనాలకు ఇక నుండి పదేళ్ల జైలు శిక్ష విధించనున్నారు. ఈ చట్టం రేపటి నుండి అమలు కాబోతుంది. గుజరాత్ ప్రభుత్వం గొలుసు దొంగతనాలను అరికట్టేందుకు గత సంవత్సరం తీసుకువచ్చిన కఠినమైన చట్టసవరణ బిల్లుకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అమోద్ర ముద్ర వేశారు.

హత్యకు 14 సంవత్సరాలైతే గొలుసు దొంగతనానికి 10 సంవత్సరాల శిక్ష

హత్యకు 14 సంవత్సరాలైతే గొలుసు దొంగతనానికి 10 సంవత్సరాల శిక్ష

గుజరాత్ లో మహిళలకు మరింత భద్రత కల్పించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన చట్టాన్ని తీసుకువచ్చింది. ఇందులో బాగంగానే గుజరాత్ ప్రభుత్వం క్రిమినల్ చట్టం బిల్ 2018 ని అసెంబ్లిలో ప్రవేశపెట్టింది. దీని ఆమోదముద్ర కోసం రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం పంపింది. ఈ చట్టం ప్రకారం గుజరాత్ రాష్ట్రంలో సాధరణ గొలుసు దొంగతనం చేసి నిరూపణ అయితే గరిష్టంగా 10 సంవత్సరాల జైలు శిక్ష విధించడంతో పాటు 25వేల రూపాయల జరిమాన విధిస్తారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం ఐపిసి సెక్షన్ 379 సవరణ చేసింది వీటికి అదనంగా 379 (ఏ) మరియు 379 (బీ) ని చేర్చింది.

గొలుసు దొంగతనాలకు ప్రయత్నించిన 5 నుండి 7 సంవత్సరాలు శిక్ష

గొలుసు దొంగతనాలకు ప్రయత్నించిన 5 నుండి 7 సంవత్సరాలు శిక్ష

కాగా ప్రస్తుతం గుజరాత్ లోని చట్టాల ప్రకారం గొలుసు దొంగతనాలకు పాల్పడితే ఆ వ్యక్తికి 3 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది. దీన్ని సవరిస్తూ 10 సంవత్సరాలకు పెంచారు.
ఇక గొలుసు దొంగతనాలకు ప్రయత్నించిన వ్యక్తులకు కనీసం 5 ఐదు సంవత్సరాల నుండి గరిష్టంగా 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించనున్నారు. మరోవైపు గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తి పారిపోయో క్రమంలో మహిళలను గాయలపాలు చేస్తే వారికి కూడ పది సంవత్సరాల శిక్షను విధించనున్నారు.

ప్రస్తుత చట్టాలతో నేరస్థులు బెయిల్ పై వస్తున్నారు, హోంమంత్రి

ప్రస్తుత చట్టాలతో నేరస్థులు బెయిల్ పై వస్తున్నారు, హోంమంత్రి

కాగా గత సంవత్సరం బిల్లును ప్రవేశపెట్టే సమయంలో గుజరాత్ హోంమంత్రి ప్రదీప్ సిన్హా జడజా మాట్లాడుతూ ప్రస్తతం ఉన్న చట్టాల ప్రకారం గొలుసు దొంగతనాలకు పాల్పడిన వ్యక్తులు చట్టం నుండి సులువుగా తప్పించుకుంటున్నారని , నేరాలకు పాల్పడిన వారు త్వరలోనే బెయిల్ పై వస్తున్నారని అన్నారు. ఈనేపథ్యంలోనే కఠిన చట్టాన్ని తీసుకువచ్చేందుకు బిల్లును ప్రవేశపెడుతున్నట్టు ఆయన పేర్కోన్నారు. ఈనేపథ్యంలోనే చట్టసవరణ బిల్లు రాష్ట్రపతికి చేరింది.

English summary
The Criminal Law (Gujarat Amendment) Bill 2018 (Chain snatching) passed by the state assembly in September last year making the law more stringent, has got President Ramnath Kovind’s assent.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X