చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నైలో ప్రాణాలతో చెలగాటం: మహిళ మెడ తెగింది, 60 మీటర్లు, బంగారు, వైరల్ వీడియో!

|
Google Oneindia TeluguNews

Recommended Video

CCTV captures shocking chain Snatching incidents

చెన్నై: చెన్నై నగరంలో చెయిన్ స్నాచర్లు చెలరేగిపోతున్నారు. మెడలో ఉన్న గొలుసు తెగకపోవడంతో కిందపడిన మహిళను చైన్ తో పాటు దాదాపు 70 మీటర్లు దూరం లాక్కెళ్లారు. తీవ్రగాయాలైన బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మరోచోట భర్త కళ్ల ముందే ఓ మహిళ బంగారు గొలుసు చాకచక్యంగా లాక్కొని పరారైనారు. మహిళల ప్రాణాలతో చెలగాటం ఆడి చైయిన్ స్నాచింగ్ చేసి పుదుచ్చేరిలో తలదాచుకున్న ఓ నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. రెండు చోట్ల సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఈ వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి.

బంధువు ఇంటికి

బంధువు ఇంటికి

చెన్నైలోని వాషర్ పేటకు చెందిన మేనక (47) అరుంబాక్కంలో నివాసం ఉంటున్న బంధువుల ఇంటి దగ్గరకు నడిచి బయలుదేరారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు బైక్ లో ఆమెను వెంబడించారు. జనసంచారం లేని ప్రాంతంలో మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు లాక్కొవాలని ప్లాన్ వేశారు.

మెడ తెగిపోయింది

మెడ తెగిపోయింది

ఒంటరిగా వెలుతున్న మేనక మెడలో ఉన్న బంగారు గొలుసు బైక్ లో వెనుక కుర్చుని ఉన్న యువకుడు లాగాడు. అది ఎంతకూ తెగకపోవడంతో మేనక కిందపడిపోయారు. ఆ సమయంలో బంగారు గొలుసు వదలని నిందితులు ఆమెసు సుమారు 70 మీటర్లు లాక్కొని వెళ్లారు. ఆసమయంలో మేనక మెడ తెగిపోయింది.

తీవ్రగాయాలు

తీవ్రగాయాలు

బంగారు గొలుసు తెగి మేనక మెడకోసుకుపోయింది. కిందపడి రోడ్డు మీద లాక్కెళ్లడంతో శరీరం మీద అనేక గాయాలు అయిన మేనక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నది. మేనకను రోడ్డు మీద లాక్కెళ్లడం సమీపంలోని ఇంటి దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దంపతులు

దంపతులు

కద్రతూర్ ప్రాంతంలో నివాసం ఉంటున్న అశోక్ కుమార్ (61), జయశ్రీ (56) దంపతులు ఇంటి సమీపంలో నడిచి వెలుతున్నారు. ఆ సమయంలో దంపతులను వెంబడించిన ఓ యువకుడు వెనుక నుంచి ఆమె మెడలో బంగారు గొలుసు లాగేశాడు. జయశ్రీ కిందపడటంతో గొలుసు తెగిపోయింది.

ఫలితం లేదు

ఫలితం లేదు

జయశ్రీ భర్త అశోక్ కుమార్ కేకలు వేస్తూ చెయిన్ స్నాచర్లను పట్టుకోవడానికి ప్రయత్నించారు. అయితే నిందితులు బంగారు గొలుసుతో బ్లూ కలర్ పల్సర్ బైక్ లో అక్కడి నుంచి పరారైనారు. జయశ్రీ మెడలో బంగారు గొలుసు లాక్కొని వెళ్లిన సమయంలో అదే ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీకెమెరాలో రికార్డు అయ్యింది.

పుదుచ్చేరిలో అరెస్టు

పుదుచ్చేరిలో అరెస్టు

జయశ్రీ మెడలో గొలుసు లాక్కొని వెళ్లిన నిందితుడిని సీసీకెమెరాలో గుర్తించిన పోలీసులు అతను అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న శివ అని గుర్తించారు. పోలీసులు శివ ఇంటికి వెళ్లి చూడగా అతను మాయం అయ్యాడు. చివరికి పుద్దుచ్చేరిలో శివ ఉన్నట్లు మొబైల్ టవర్ల ద్వారా గుర్తించిన పోలీసులు మంగళవారం అతన్ని అరెస్టు చేసి చెన్నై తీసుకు వచ్చి కోటింగ్ ఇస్తున్నారు.

English summary
Two incidents of chain snatching, which took place in different parts of the Chennai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X