వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చక్కా జామ్: దిల్లీ చుట్టూ భారీ ఎత్తున భద్రతా బలగాలు, బారికేడ్లు, ఇనుప ముళ్ల కంచెలు, డ్రోన్ కెమెరాలు

By Bbc Telugu
|
Google Oneindia TeluguNews
బారికేడ్లు, ముళ్లకంచె

వ్యవసాయ సంస్కరణ చట్టాలను వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులు శనివారం దేశవ్యాప్త చక్కా జామ్ (రాస్తా రోకో) చేపట్టిన నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీ నగరంతో పాటు, జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో భారీ ఎత్తున పోలీసు, పారా మిలటరీ, రిజర్వు బలగాలను మోహరించారు.

''దిల్లీ, ఎన్‌సీఆర్ ప్రాంతంలో సుమారు 50,000 మంది పోలీసు, పారామిలటరీ, రిజర్వు ఫోర్స్ బలగాలను మోహరించాం.

ఎలాంటి సమస్యలూ తలెత్తకుండా ఉండటం కోసం రాజధానిలో 12 మెట్రో స్టేషన్లను అప్రమత్తం చేశాం.

వాటిలో ప్రవేశం, నిష్క్రమణ ద్వారాలను మూసివేయాలని చెప్పాం'' అని దిల్లీ పోలీసు విభాగం తెలిపింది.

https://twitter.com/ANI/status/1357896810870632449

కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ గత నవంబర్ 26 నుంచి దిల్లీ సరిహద్దుల్లో రైతు సంఘాలు నిరసన చేపట్టాయి.

ప్రభుత్వంపై ఒత్తిడిని పెంచటం కోసం ఫిబ్రవరి 6న దేశవ్యాప్తంగా చక్కా జామ్ నిర్వహిస్తామని గత సోమవారం ప్రకటించారు.

దిల్లీ, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్‌లను మినహాయించి.. దేశమంతటా జాతీయ, రాష్ట్ర రహదారులను దిగ్బంధిస్తామని చెప్పారు.

ఈ చక్కా జామ్ శనివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకూ కొనసాగుతుంది.

https://twitter.com/ANI/status/1357865991854718978

ఈ నేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. రహదారులపై భద్రత సిబ్బంది అనేక వరుసల్లో బారికేడ్లను ఏర్పాటు చేశారు.

దేశ రాజధాని నగరంలో పరిణామాలను పర్యవేక్షించటానికి డ్రోన్ కెమెరాలను పెద్ద ఎత్తున సిద్ధం చేశారు.

https://twitter.com/ANI/status/1357904818560376834

ఎర్ర కోట వద్ద కూడా భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించటం కనిపించింది. మింటో బ్రిడ్జి వద్ద భారీ ఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేసి.. పోలీసు బలగాలను మోహరించారు.

https://twitter.com/ANI/status/1357886345063002119

ముందస్తు చర్యగా ఈ ప్రాంతాన్ని మొత్తం దిగ్బంధించారు. దిల్లీలోని ఐటీఓ సమీపంలో పోలీస్ బారికేడ్ల మీద బార్బ్‌డ్ వైర్లు (ముళ్ల కంచెలు) వేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

English summary
Chakka Jam: Massive security forces, barricades,drone cameras around Delhi
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X