వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాలికపై రేప్, హత్య: 5గురు నిందితులకు ఉరిశిక్ష

|
Google Oneindia TeluguNews

భువనేశ్వర్‌: ఓ బాలికపై సామూహిక అత్యాచారం చేసి, హత్య చేసిన ఐదుగురికి ఒడిశా రాష్ట్రంలోని కేంఝార్‌ జిల్లా చంపువా సెషన్స్‌ కోర్టు సోమవారం ఉరిశిక్ష విధించింది. కేంఝార్‌ జిల్లా బడ్బిల్‌ సమితి బలిపడా గ్రామంలో 2012 ఆగస్టు 1న హత్యాచార ఘటన చోటుచేసుకుంది.

గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని బ్రిందా మహకుద్‌ ట్యూషన్‌కు వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా మార్గంలో నిందితులు అటకాయించారు. బాలికను తీసుకెళ్లి సామూహిక అత్యాచారం జరిపి, అనంతరం హత్య చేశారు.

ఈ కేసులో మతాహుండా, జతిన్‌ హుండా, హర్జిత్‌సింగ్‌, బిశ్వనాథ్‌ ముండా, మంగల్‌ పుర్తి అనే ఐదుగురు యువకులు దోషులుగా తేలింది. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు.

Champua Minor girl rape and Murder case: five accused gets death penalty

ఢిల్లీలో కుటుంబం సజీవ దహనం

దేశరాజధానిలో జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో ముగ్గురు చిన్నారులతో సహా ఓ కుటుంబం సజీవదహనమైంది. ఈ కుటుంబంలో మరణించిన భార్య, భర్తలిద్దరూ దృష్టి లోపంతో బాధపడుతున్న వారు కావడం గమనార్హం.

మృతుల్లో 8నెలల బాబు, 8ఏళ్లలోపు ఇద్దరు చిన్నారులు అగ్నికి ఆహుతయ్యారు. ఈ దుర్ఘటన వాయవ్య ఢిల్లీలోని బల్‌స్వా డైరీ ప్రాంతంలో సోమవారం చోటుచేసుకున్నది. మృతులను కలాం (35), రవీనా (32), సలామత్ (8), నియామత్ (6), అజ్మత్ (8 నెలలు)గా గుర్తించారు. బీహార్‌లోని మధుబన్ జిల్లా వాసులైన వీరు జీవనోపాధి కోసం ఢిల్లీ వచ్చారు.

English summary
Keonjhar District's Champua Additional District and sessions Court today awarded death sentence to five accused in the rape and murder of a minor girl in Beklundi village in the district in 2012.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X