వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చందాకొచ్చర్‌ మరిది రాజీవ్‌ను అదుపులోకి తీసుకొన్న సీబీఐ

By Narsimha
|
Google Oneindia TeluguNews

ముంబై:ఐసీఐసీఐ-వీడియోకాన్ గ్రూపు‌ రుణ వివాదంలో సీబీఐ దర్యాప్తును వేగవంతం చేసింది. ఐసీఐసీఐ బ్యాంకు సీఎండీ చందాకొచ్చర్ భర్త దీపక్ కొచ్చర్ సోదరుడు రాజీవ్ కొచ్చర్ ను గురువారం నాడు సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నారు.

ముంబై విమానాశ్రయంనుంచి సింగపూర్‌ వెళుతుండగా అతనిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో చందాకొచర్‌ భర్త దీపక్‌ కొచర్‌, వీడియోకాన్‌ ఎండీ వేణుగోపాల్‌ధూత్‌పై ప్రాథమిక దర్యాప్తు చేపట్టిన సీబీఐ కొన్ని కీలక పత్రాలను స్వాధీనం చేసుకొంది.

 Chanda Kochhars brother-in-law detained at Mumbai airport, being quizzed by CBI

కానీ ఇంతవర​కూ దీపక్‌ను ప్రశ్నించలేదు. దీపక్‌ కొచర్‌కుచెందిన న్యూపవర్‌రెన్యువబుల్స్‌ కంపెనీకి ఐటీ శాఖ నోటీసులు జారీ చేసింది. 2012లో వీడియోకాన్ గ్రూపుకు రూ.3,250 కోట్ల విలువైన రుణాల మంజూరు చేసిన సమయంలో బ్యాంకు సీఈవో చందా కొచర్‌పై ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే ఐసీఐసీఐ బ్యాంకు బోర్డు ఈ ఆరోపణలను ఖండించింది. చందాకొచ్చర్‌కు ఐసీఐసీఐ బ్యాంకు పాలకవర్గం పూర్తిగా అండగా నిలిచింది.

ఈ వ్యవహరంలో దీపక్ సోదరుడు చందాకొచ్చర్ మరిది రాజీవ్ కొచ్చర్‌కు చెందిన అవిస్టా సంస్థ కూడా చేరింది. ఐసీఐసీఐ బ్యాంక్‌ నుంచి రుణాలు పొందిన పలు కంపెనీలకు అవిస్టా రుణ పునర్‌వ్యవస్థీకరణ సేవలు అందించిందంది. అవిస్టా సేవలు పొందిన వాటిల్లో జైప్రకాశ్‌ అసోసియేట్స్, జైప్రకాశ్‌ పవర్‌లతో పాటు వీడియోకాన్, జీటీఎల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సుజ్లాన్‌ తదితర కంపెనీలు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.

అయితే వీటిని రాజీవ్‌ కొచర్‌ ఖండించారు. . భారతీయ బ్యాంకులతో ఎలాంటి సిండికేషన్‌ ఉండకూడదనే ఒక నియమాన్ని తాము పెట్టుకున్నామన్నారు. ఈక్రమంలో చందా కొచర్‌ సీఈవోగా ఉన్న ఐసీఐసీఐ బ్యాంకుతో తమకు ఎలాంటి సంబంధాలు లేవని స్పష్టం చేశారు. ఇండోనేషియా, దుబాయ్‌లోని కార్యాలయాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా వ్యాపారం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. ఇదేదో కావాలని చేస్తున్న దుష్ప్రచారంగా రాజీవ్‌ కొచర్‌ కొట్టిపారేశారు.

English summary
Rajiv Kochhar, the brother-in-law of ICICI Bank MD & CEO Chanda Kochhar, was detained by immigration authorities at Mumbai airport when he was to leave for a Southeast Asian country and handed over to CBI sleuths, who questioned him in connection with the bank's dealing with Videocon Group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X