వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.442కు రెండు అరటిపండ్ల ఘటనపై విచారణ .. తప్పుచేస్తే స్టార్ హోటల్‌కు చుక్కలే..!!

|
Google Oneindia TeluguNews

చండీగఢ్ : రెండు అరటిపండ్లకు రూ.442.50 బిల్లు వేసిన ఘటనపై ఎక్సైజ్, టాక్సెషన్ శాఖ స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతామని స్పష్టంచేసింది. ఒకవేళ స్టార్ హోటల్ తప్పు చేసినట్టు రుజువైతే చర్యలు తప్పదని తేల్చిచెప్పింది. వినియోగదారుల నుంచి అక్రమంగా నగదు వసూల్ చేసినవారు ఎంతటివారైనా ఉపేక్షించబోమని వెల్లడించింది.

ఏం జరిగిందంటే ..
బాలీవుడ్ నటుడు రాహుల్ బోస్ .. షూటింగ్ కోసం చండీగఢ్ వెళ్లారు. అయితే అక్కడ ఉండేందుకు జేడబ్ల్యూ మారియట్ హోటల్‌లో దిగారు. అయితే ఎప్పుడూ జిమ్ చేసే రాహుల్ .. భోజనం తర్వాత అరటి పండ్లు తినడం అలవాటు. ఎప్పటిలాగే ఆ హోటల్లో కూడా రెండు అరటి పండ్లను ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేస్తే పండ్లు వచ్చాయి. కానీ తర్వాత బిల్లు చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంకయ్యింది బోస్‌కు. ఎందుకో తెలుసా .. ఆ ఫైవ్ స్టార్ హోటల్ సిబ్బంది రెండు అరటి పండ్లకు రూ.442.50 బిల్ వేశారు. దీంతో నోటి నుంచి మాట కూడా రాలేదు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ట్విట్టర్‌లో షేర్ చేశారు. ట్విట్టర్‌లో ఓ వీడియో షేర్ చేశారు. దానికి క్యాప్షన్ మీరు నమ్ముతారా అని పెట్టి యూజర్లకు ఆసక్తి కలిగించారు. మీకు ఎవరు చెప్పారు పండ్లు హానికరం కాదని, హానికరమేనని చెప్పారు. తాను ఉన్న హోటల్ పేరు రాసి వారు తనకు రెండు అరటిపండ్లకు వేసిన బిల్లును ప్రస్తావించారు.

Chandigarh DC orders probe after Rahul Bose banana bill video: Will take action if hotel guilt

చర్యలు తప్పవు ..
రాహుల్ బోస్ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది. దీంతో చండీగఢ్ ఎక్సైజ్, టాక్సెషన్ కమిషనర్ మణ్‌దీప్ సింగ్ బ్రర్ స్పందించారు. ఈ ఘటనపై హై లెవల్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు పేర్కొన్నారు. అసిస్టెంట్ ఎక్సైజ్ అండ్ టాక్సెషన్ కమిషనర్ రాజీవ్ చౌదరి నేతృత్వంలో విచారణ జరగుతుందని వివరించారు. రాహుల్ బోస్ ఆర్డర్ ఇచ్చిన అరటి పండ్లకు హోటల్ యాజమాన్యం జీఎస్టీ బిల్లు ఎంత వేసిందో విచారిస్తారని తెలిపారు. ఒకవేళ దానిలో ఏమైనా తేడా వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పుచేస్తే ఎంతటివారినైనా ఉపేక్షించబోమని స్పష్టంచేశారు.

English summary
Following the actor's hotel bill reaction video, many Twitterati trolled Rahul for buying bananas in a 5-star hotel and others shared their hilarious 'Rahul Bose moment' revealing similar experiences. Now, the Chandigarh Deputy Commissioner and Excise and Taxation Commissioner Mandip Singh Brar has ordered a high-level investigation into the matter. In a statement to Indian Express, Brar said,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X