వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మతాంతర వివాహం...? పెళ్లి చేసుకునేందుకు వెళ్లిన ఆ యువకుడి అరెస్ట్... వీడియో వైరల్..

|
Google Oneindia TeluguNews

ముస్లిం మతానికి చెందిన ఓ యువకుడు మరో మతానికి చెందిన ఓ యువతిని కోర్టులో పెళ్లి చేసుకునేందుకు వెళ్లగా చంఢీగఢ్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆ యువతిని బలవంతంగా తన ఆధీనంలో ఉంచుకున్నాడన్న ఆరోపణలపై అతన్ని అరెస్ట్ చేసినట్లు తెలిపారు. కోర్టు ప్రాంగణం నుంచి అతన్ని లాక్కెళ్తూ పోలీస్ జీపు ఎక్కించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

అతనితో పాటు ఉన్న ఆ యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనిపై చంఢీగఢ్ సివిల్ లైన్స్ సర్కిల్ ఆఫీసర్ అనిల్ సమానియా మాట్లాడుతూ... ఆ యువకుడి పేరు సోను మాలిక్ అని, అలీగఢ్‌లో అతను టైలర్‌గా పనిచేస్తుంటాడని చెప్పారు. ఆ యువతితో పరిచయం పెంచుకున్న అతను... ఆమెను బలవంతంగా నిర్బంధించి వివాహం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని పేర్కొన్నారు. అరెస్ట్ అనంతరం అతన్ని కస్టడీకి తరలించినట్లు తెలిపారు.

Chandigarh man trying to perform interfaith marriage in Aligarh arrested

ఇటీవలే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యాంటీ లవ్ జిహాద్ చట్టాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.బలవంతపు మతమార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు మత మార్పిడి నిషేధ ఆర్డినెన్స్- 2020 పేరుతో చట్టాన్ని తీసుకొచ్చింది. గత శనివారం(నవంబర్ 28) నుంచే ఈ చట్టం ప్రకారం పెళ్లి కోసం మత మార్పిడికై అమ్మాయిలను బలవంతపెట్టేవారికి పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించవచ్చు.

అంతేకాదు,కులాంత‌ర‌, మ‌తాంత‌ర వివాహాల‌ను ప్రోత్స‌హించే పథకాన్ని కూడా రద్దు చేసే యోచనలో యోగి సర్కార్ ఉన్నది.ఈ స్కీమ్ కింద‌.. మ‌తాంత‌ర వివాహం చేసుకున్న వారికి రూ.50వేలు నగదు ప్రోత్సాహం అందిస్తారు.ఇందుకోసం ఆ జంట పెళ్లి జ‌రిగిన రెండేళ్ల‌లోపు జిల్లా మెజిస్ట్రేట్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి. ఆ ద‌ర‌ఖాస్తు ఆమోదం పొందిన తర్వాత నగదు అందుతుంది. గ‌త ఏడాది ఈ స్కీమ్ కింద 11 జంట‌లు ల‌బ్ధి పొందాయి.ఈ ఏడాది నాలుగు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.

English summary
A Muslim man who had come here from Chandigarh with a local woman to tie an interfaith nuptial knot in the court was arrested on charges of forcibly detaining her, police said on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X