ఈ ఏడాది చివరి ఉపఛాయ చంద్రగ్రహణం: ఎప్పుడు? గ్రహణ ప్రత్యేక ఏంటి? పూర్తి వివరాలు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చివరి చంద్రగ్రహణం నవంబరు నెల చివరలో ఏర్పడనుంది. కార్తీక పూర్ణిమ నాడు, అంటే నవంబర్ 30న ఈ ఉపఛాయ చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ ఏడాదిలో చివరిది కావడంతో ఈ చంద్రగ్రహణానికి ప్రాధాన్యత సంతరించుకుంది. గ్రహణ సమయం, ప్రభావం లాంటి వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ఇది ఉపఛాయ చంద్రగ్రహణం ఎందుకంటే..
ఈ చంద్రగ్రహణం కంటికి కనిపించదు కాబట్టి.. దీన్ని ఉపఛాయ చంద్ర గ్రహణం అని పిలుస్తున్నారని ఖగోళ నిపుణులు పేర్కొన్నారు. ఈ ఉపఛాయ చంద్రగ్రహణం సోమవారం మధ్యాహ్నం ఏర్పడనుందని వెల్లడించారు. మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు ఈ చంద్రగ్రహణం సంభవించనుంది.

ఉపఛాయ చంద్రగ్రహణం ఎప్పుడంటే..?
చంద్రగ్రహణం ప్రారంభ సమయం: నవంబర్ 30 మధ్యాహ్నం 1:04 గంటలకు
చంద్ర గ్రహణ మధ్య కాలం: నవంబర్ 30 మధ్యాహ్నం 3:13 గంటలకు
చంద్రగ్రహణం ముగింపు సమయం: నవంబర్ 30 సాయంత్రం 5:22 గంటలకు.

చంద్రగ్రహణ ప్రభావం:
జ్యోతిష్కులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ చంద్రగ్రహణం 2020లో చివరిది.
ఈ సంవత్సరం చివరి చంద్ర గ్రహణం.. వృషభం రాశి, రోహిణి నక్షత్రాన్ని ప్రభావితం చేస్తుందని, దాదాపు అన్ని రాశిచక్ర గుర్తులపై కూడా ప్రభావం చూపుతుందని జ్యోతిష్కులు వివరించారు.

ఈ గ్రహణానికి సుతక్ కాలం చెల్లుబాటు కాదు.. భారత్లో కనిపిస్తుంది..
ప్రతి గ్రహణానికి సుతక్ కాలం ఉంటుంది, ఈ సమయంలో మంత్రాలు జపించి ధ్యానం చేయాలని సూచించారు. రాబోయే చంద్ర గ్రహణంలో, సుతక్ కాలం చెల్లుబాటు కాదు ఎందుకంటే ఇది 'ఉపఛాయ' గ్రహణం. ఈ గ్రహణం కంటికి కనిపించదని చెబుతున్నప్పటికీ.. ఖగోల నిపుణులు మాత్రం నవంబర్ 30న సంభవించే ఈ ఛాయ చంద్రగ్రహణం భారత్, ఆస్ట్రేలియా, అమెరికా, పసిఫిక్ సముద్రం, ఆసియా ప్రాంతాలవారికి కనిపిస్తుందని తెలిపారు.