వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నా వల్లే హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్: ముస్సోరిలో చంద్రబాబు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తన వల్లే మైక్రోసాఫ్ట్ తన కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. మంగళవారం ఆయన ఉత్తరాఖండ్‌లోని ముస్సోరి లాల్‌బహదూర్‌శాస్త్రి జాతీయ పరిపాలన అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న యువ ఐఏఎస్‌లనుద్దేశించి ప్రసంగించారు.

సివిల్స్‌కు పోటీ పడేవారంతా మేధావులైన విద్యార్థులేనని చంద్రబాబు అన్నారు. ప్రజాసేవ చేయాలనుకునేవారే సివిల్స్‌కు వస్తారని చెప్పారు. కష్టపడితే డబ్బు సంపాదన పెద్ద విషయమేమీ కాదని అన్నారు.

Chandrababu speech in Mussoorie

అటల్ బిహారీ వాజ్‌పాయి ప్రధానిగా ఉన్న సమయంలో దేశాన్ని సాంకేతికంగా అభివృద్ధి చేయాలని తానే సూచించినట్లు చంద్రబాబు తెలిపారు. సెల్‌ఫోన్లు, ఇంటర్నెట్ వల్ల ఎగుమతులు బాగా పెరిగాయని చెప్పారు. సముద్ర వనరులను చైనా బాగా ఉపయోగించుకుంటోందని తెలిపారు.

30 ఏళ్ల తర్వాత దేశ ప్రజలు నరేంద్ర మోడీకి పూర్తిస్థాయి ఆధిక్యాన్ని ఇచ్చారన్నారు. సింగపూర్‌, దక్షిణ కొరియా, హాంకాంగ్‌, చైనా మాత్రమే రెండంకెల వృద్ధి సాధించాయన్నారు. చైనా అభివృద్ధిని ప్రత్యక్షంగా పరిశీలించానని, 33 కి.మీ దూరంలోని విమానాశ్రయానికి 7 నిమిషాల్లో చేరుకుంటున్నారని చెప్పారు..

సముద్రంలో 33 కి.మీ మేర చైనా ఫ్త్లెఓవర్‌ కట్టించిందని చంద్రబాబు వివరించారు. సముద్ర వనరులను చైనా బాగా ఉపయోగించుకుంటోందన్నారు. ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, వేగవంతమైన రైళ్లు చైనాలో ఎక్కువగా ఉన్నాయన్నారు. వచ్చే ముప్పై ఏళ్లలో భారత్ ఎదురులేని శక్తిగా ఎదుగుతుందని అన్నారు. మరో ఐదేళ్లలో ఐటిలో భారత్ అగ్రగామిగా నిలుస్తుందని చెప్పారు.

English summary
Andhra Pradesh CM Chandrababu Naidu on Tuesday Spoke to a crowd of Trainee IAS officers in Mussoorie.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X