వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేశంలోనే కాస్టులీ సీయం చంద్ర‌బాబు..! కుమార స్వామి ప్ర‌మాణ‌స్వీకారానికి 9ల‌క్ష‌ల ఖ‌ర్చు..!!

|
Google Oneindia TeluguNews

ఏపి సీయం చంద్ర‌బాబు నాయుడు ప్ర‌జా సంక్షేమ కార్య‌క్ర‌మాలు ఎంత ప‌క‌గ‌డ్బందీగా రూప‌క‌ల్స‌న చేస్తారో అంతే స్థాయిలో త‌న హంగూ ఆర్బాటాన్ని కూడా ప్ర‌ద‌ర్శిస్తుంటారు. ఏ కార్య‌క్ర‌మానికి వెళ్లినా మందీ, మార్బ‌లం తో హ‌డావిడి చేస్తుంటారు. ఇక విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కైతే చెప్పాల్సిన అవ‌స‌ర‌వం ఉండ‌దు. ఒక టీం మొత్తాన్ని ప్ర‌త్యేక విమానంలో విదేశాల‌కు తీసుకువెళ్లి కార్య‌క్ర‌మాలు నెర‌వ‌పుతుంటారు చంద్ర‌బాబు. అందుకోసం ఎంత ఖ‌ర్చు అవుతుంది, ఎంత న‌ష్టం జ‌రుగుతుందిఅనే అంశాల ప‌ట్ల ఆయ‌న డోంట్ కేర్ అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. గ‌తంలో సింగ‌పూర్, ర‌ష్యా, చైనా దేశాల ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా బాబు చేసిన ఖ‌ర్చు చూసి ప్ర‌తిప‌క్షాలు నానా రాద్దాంతం చేసాయి. అసెంబ్లీలో కూడా బాబు గారి దుబారా ఖ‌ర్చు గురించి ప్ర‌తిప‌క్ష వైసీపి సూటిగా ప్ర‌శ్నించే ప్ర‌య‌త్నం చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కూ 23 సార్లు విదేశాల‌కు వెళ్లిన చంద్ర‌బాబు వేల కోట్ల‌లో ప్ర‌భుత్వ ఖ‌జానాను వాడుకున్న‌ట్టు స‌మాచారం.

స్వ‌దేశంలో ల‌క్ష‌లు, విదేశంలో కోట్లు..ఇదీ బాబు ఖ‌ర్చుల వివ‌రాలు..!!

స్వ‌దేశంలో ల‌క్ష‌లు, విదేశంలో కోట్లు..ఇదీ బాబు ఖ‌ర్చుల వివ‌రాలు..!!

తాజాగా కుమార స్వామి ప్ర‌మాణ స్వీకారానికి వెళ్లిన ముఖ్య‌మంత్రి చేసిన ఖ‌ర్చు చూసి జాతీయ మీడియా అవాక్క‌వుతోంది. బెంగ‌ళూరులోని తాజ్ వెస్ట్ ఎండ్ లో మే 23న బ‌స చేసిన చంద్ర‌బాబు కుమార స్వామి ప్ర‌మాణ‌స్వీకారం త‌ర్వాత మ‌రుస‌టి రోజున చెకౌట్ చేసారు. అప్పుడు హోట‌ల్ యాజ‌మాన్యం వేసిన మొత్తం బిల్లు అక్ష‌రాల 8ల‌క్ష‌ల 72వేల 485 రూపాయ‌లు. అదే స‌మ‌యంలో ఢిల్లీ ముఖ్య‌మంత్రి కేజ్రీ వాల్ కు ఐన ఖ‌ర్చు కేవలం 76వేలు మాత్ర‌మే..!! అలాగే ప్ర‌మాణ స్వీకారానికి వ‌చ్చిన గెస్టుల‌కు హై టీ పార్టీని రెండు 5స్టార్ హోట‌ల్స్ తాజ్ వెస్ట్ ఎండ్, షాంగ్రి లా లో ఏర్పాటు చేసారు. దానికి ఐన ఖ‌ర్చు కూడా పెద్ద‌మొత్తంలో ఉండ‌టం విశేషం. కేవ‌లం టీ, బిస్క‌ట్ల‌కు 4ల‌క్ష‌ల 35వేల రూపాయ‌ల‌ను కుమార స్వామి ప్ర‌భుత్వం ఖ‌ర్చు చేసిన‌ట్టు తెలుస్తోంది.

లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రం.. ఇంత దుబారా ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షం..

లోటు బ‌డ్జెట్ లో ఉన్న రాష్ట్రం.. ఇంత దుబారా ఏంట‌ని ప్ర‌శ్నిస్తున్న ప్ర‌తిప‌క్షం..

ఇక‌ దేశంలోని మొత్తం 31 మంది ముఖ్యమంత్రుల్లో 24 మంది (81 శాతం) కోటీశ్వరులేనని ఎన్నికల సంస్కరణల కోసం కృషి చేస్తున్న అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌(ఏడీఆర్‌) ఓ నివేదిక విడుదల చేసింది. వీరిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఎన్‌.చంద్రబాబు నాయుడు రూ.177 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా నిలిచినట్లు ఏడీఆర్‌ తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌ సీఎం పెమా ఖండూ రూ.129 కోట్లకుపైగా ఆస్తులతో రెండోస్థానంలో, పంజాబ్‌ ముఖ్యమంత్రి అమరీందర్‌ సింగ్‌ రూ.48 కోట్లతో మూడోస్థానంలో నిలిచినట్లు వెల్లడించింది. దేశంలో ముఖ్యమంత్రుల సగటు ఆస్తి రూ.16.18 కోట్లుగా ఉందంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన సీఎంల అఫిడవిట్లను పరిశీలించిన ఏడీఆర్, నేషనల్‌ ఎలక్షన్‌ వాచ్‌(ఎన్‌ఎల్‌డబ్ల్యూ)లు ఈ నివేదికను రూపొందించాయి.

విదేశీ ఒప్పందాల ఫ‌లితాలు ఎప్ప‌టికో..! ఖ‌ర్చు మాత్రం వాచి పోతోంది...!!

విదేశీ ఒప్పందాల ఫ‌లితాలు ఎప్ప‌టికో..! ఖ‌ర్చు మాత్రం వాచి పోతోంది...!!

చంద్రబాబు సింగపూర్, జపాన్, చైనా వంటి దేశాల్లో పర్యటించారు. హైదరాబాద్ నుంచి ఆయా దేశాలకు విమాన సౌకర్యం ఉందని అయినా కూడా లక్షలు, కోట్ల రూపాయలు ఖర్చు చేసి అద్దె విమానాలలో వెళ్లవలసిన అవసరం ఏంటనే ప్ర‌శ్న ఉత్ప‌న్న‌మ‌వుతోంది. ఇలా చంద్రబాబు చేస్తున్న లగ్జరీ ఖర్చుల వివరాలు బయటపెట్టకుండా వాటి జీవోల నెంబర్లు మాత్రమే బయటపెడదానికి గల కారణల పై కూడా సందేహాలు వ్య‌క్తం అవుతున్నాయి. గ‌తంలో లేక్ వ్యూ గెస్ట్ హౌస్ కోసం చంద్రబాబు ఖర్చు చేసిన రూ 45 కోట్లు. చంద్రబాబు తన వ్యక్తి గత సౌకర్యాలను పెంచుకోవడానికి, లగ్జరీ లైఫ్ ని అనుభవించడానికే అధికారంలోకి వచ్చినట్లుంది కానీ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి అధికారం లోకి వచ్చినట్లు లేదని వైసీపి తీవ్ర విమర్శలు చేసింది. తమది రైతుల, ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే చంద్రబాబు ఈ ఖర్చులపై వివరణ ఇవ్వాలని ప్ర‌తిప‌క్ష పార్టీ డిమాండ్ చేస్తోంది.

దేశంలో ఎక్క‌డా ఇంత ఖ‌రీదైన ముఖ్య‌మంత్రి లేడంటూ ప్ర‌తిప‌క్షం చుర‌క‌లు..

దేశంలో ఎక్క‌డా ఇంత ఖ‌రీదైన ముఖ్య‌మంత్రి లేడంటూ ప్ర‌తిప‌క్షం చుర‌క‌లు..

ఇక జనవరిలో జరిగిన దావోస్‌ సదస్సులో.. రాష్ట్రంలో ఆయిల్‌ రిఫైనరీ ఏర్పాటు కోసం సౌదీ అరామ్‌కో సంస్థతో జరిగిన చర్చల కోసం ఈ దేశాల పర్యటనలకు గాను చంద్రబాబు అక్షరాలా రూ.100 కోట్లు కేవలం విమానాలు, హెలికాప్టర్లకు మాత్రమే ఖర్చు చేయడం పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. నిజానికి పెట్టుబడులు వచ్చి ఉంటే.. ఈ విమర్శలుగాలికి కొట్టుకుపోయేవి. కానీ, ఇవన్నీ.. కార్యరూపం దాల్చకపోవడంతోనే బాబు ఇప్పుడు దేశంలో కెల్లా దుబారా సీఎంగా మిగిలిపోయారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు.

English summary
ap cm chandra babu naidu became expensive cm in the country. in the last may when kumara swami swearing ceremony took place babu expenses around 9lack. no cm in the country did like this. the opposition party in ap demanding clarity on this worthless expenditures.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X