వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైతులకు భీమ్ ఆర్మీ చీఫ్ ఆజాద్,ఎంపీ పప్పు యాదవ్ మద్దతు... షాహీన్ బాగ్ దాదీని అదుపులోకి తీసుకున్న పోలీసులు

|
Google Oneindia TeluguNews

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆరు రోజులుగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు మహా ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. మంగళవారం(డిసెంబర్ 1) షాహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బనో,దళిత నాయకులు చంద్రశేఖర్ ఆజాద్,పప్పు యాదవ్ రైతులకు సంఘీభావం ప్రకటించారు. ఘాజిపూర్ సరిహద్దులో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్,ఎంపీ పప్పు యాదవ్ రైతులను కలుసుకున్నారు. షాహీన్ బాగ్ దాదీ బిల్కిస్ బనోని మాత్రం పోలీసులు మధ్యలోనే అడ్డుకున్నారు.

రైతులకు సంఘీభావం ప్రకటించిన సందర్భంగా చంద్రశేఖర్ ఆజాద్ మీడియాతో మాట్లాడారు. రైతులపై భాష్ప వాయువు,వాటర్ క్యాన్లను ప్రయోగించడాన్ని ఆజాద్ తీవ్రంగా తప్పు పట్టారు. రైతు ఉద్యమంతో కేంద్రానికి భయం పట్టుకుందని... అందుకే ఉద్యమాన్ని అణచివేసేందుకు లాఠీచార్జీలు,టియర్ గ్యాస్‌లు ప్రయోగిస్తోందని ఆరోపించారు. కొత్త వ్యవసాయ చట్టాలతో రైతుల భూములను కూడా పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసేందుకు కేంద్రం పూనుకుందని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆజాద్ మద్దతుదారులు కేంద్రానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

Chandrashekhar Azad, Pappu Yadav meet farmers at delhi border and supported their movement

ఎంపీ పప్పు యాదవ్ కూడా రైతులను కలుసుకుని వారికి మద్దతు ప్రకటించారు. కేంద్రం ప్రభుత్వం ఇకనైనా ఆ మూడు వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇది కేవలం పంజాబ్ రైతుల సమస్య మాత్రమే కాదని... దేశంలోని ప్రతీ రైతు సమస్య అని పేర్కొన్నారు. రైతుల పట్ల ప్రభుత్వం మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు.

Recommended Video

Andhra pradesh Assembly Speaker Tammineni Sitharam sends out 13 tdp mlas

షాహీన్ బాగ్ దాదీగా గుర్తింపు తెచ్చుకున్న వృద్దురాలు బిల్కిస్ బనో మాట్లాడుతూ... 'మేము రైతు బిడ్డలం. ఈరోజు రైతుల వద్దకు వెళ్లి వారి ఉద్యమానికి మద్దతు తెలుపుతాం. వాళ్ల తరుపున కేంద్రానికి మా గొంతుకను వినిపిస్తాం.' అని పేర్కొన్నారు. అయితే బిల్కిస్‌ను పోలీసులు సింఘూ సరిహద్దు వద్ద అదుపులోకి తీసుకున్నారు. అక్కడినుంచి ఎస్కార్ట్ వాహనంలో ఆమె ఇంటికి తరలించారు. బిల్కిస్ వయసు రీత్యా కోవిడ్ 19 దృష్టిలో పెట్టుకుని ఆమెని అక్కడికి అనుమతించలేదని పోలీసులు తెలిపారు.

English summary
While Bhim Army Chief Chandrashekhar Azad and former MP Pappu Yadav reached Ghazipur border to show their solidarity, the 82-year-old, Bilkis Bano, who earned the moniker 'Dadi of Shaheen Bagh' was stopped by Delhi Police from joining the ongoing farmers' agitation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X