వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇదిగో చంద్రుడి ఫోటో... చంద్రయాన్ 2 తీసిన తొలి ఫోటో

|
Google Oneindia TeluguNews

భారత అంతరిక్ష పరిశోధన కేంద్రం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ఉపగ్రహం తొలి ఫోటోను తీసి పంపింది. ఆగస్టు 21న చంద్రుడి ఉపరితలం నుండి 2650 కి.మీ దూరంలో ఎత్తులో నుండి ఈఫోటోను పంపింది. కాగా చంద్రయాన్ సెప్టెంబర్ 7న తెల్లవారు జామున 1.40 నిమిషాలకు ల్యాండ్ పదిహేను నిమిషాల్లో పూర్తి కానుందని ఇస్రో అధికారులు తెలిపారు.

Chandrayaan-2 captured the first image of the Moon

భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం (ఇస్రో) అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్.. ప్రయోగించినప్పటి నుంచీ ఇప్పటిదాకా భూ కక్ష్యలోనే పరిభ్రమిస్తోన్న విక్రమ్ స్పేస్ క్రాఫ్ట్..గత మంగళవారమే చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఇస్రో శాస్త్రవేత్తలు దీనికి సంబంధించిన కార్యక్రమాన్ని పూర్తి చేశారు. చంద్రుని కక్ష్యలోకి ప్రవేశించడానికి అవసరమైన ద్రవరూపంలో ఉన్న ఇంధనాన్ని 1738 సెకన్ల వరకు మండించడం వల్ల దాని స్పేస్ క్రాఫ్ట్ వేగం పెంచారు. భూకక్ష్యను దాటుకుని చంద్రుని కక్ష్యలోనికి ప్రవేశించడానికి అవసరమైన వేగాన్ని ఇస్రో శాస్త్రవేత్తలు ఈ స్పేస్ క్రాఫ్ట్ కు కల్పించారు.

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ ను ఇస్రో కిందటి నెల 22వ తేదీన నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం నుంచి ప్రయోగించిన విషయం తెలిసిందే. మూడు దశల్లో ఈ చంద్రయాన్-2 కొనసాగుతోంది. ప్రస్తుతం చివరిదశకు చేరుకుంది. చంద్రుడి కక్షకు అతి సమీపంలో పరిభ్రమిస్తోంది. అందులోకి ప్రవేశించడమే మిగిలి ఉంది. చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించిన తరువాత కూడా నాలుగు దశలను పూర్తి చేసుకున్న తరువాతే చంద్రయాన్-2 స్పేస్ క్రాఫ్ట్ చంద్రుడిపై దిగగలుగుతుంది. క్రమంగా చంద్రుడి ధృవాల వైపు ఉపరితలం నుంచి 100 కిలోమీటర్ల దూరంలోకి చేరుకుంటుంది. అదే చివరి దశ. వచ్చేనెల 7వ తేదీ నాటికి చివరి దశ పరిభ్రమణానికి చేరుకుంటుందని ఇస్రో అధికారులు వెల్లడించారు.

English summary
The Indian Space Research Organisation (ISRO) Thursday released the first image of the Moon captured by Chandrayaan-2,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X