వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2: ఆర్బిటార్ జీవితకాలం ఏడేళ్లు పెంచిన ఇస్రో..ఎలా సాధ్యమైంది..?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఇస్రో ప్రతిష్టాత్మకంగా చంద్రుడిపైకి ప్రయోగించిన చంద్రయాన్-2 చివరినిమిషంలో ల్యాండర్‌లో తలెత్తిన కమ్యూనికేషన్ సమస్యతో కాస్త నిరాశచెందినప్పటికీ తాజాగా చంద్రయాన్‌-2కు సంబంధించిన ఆర్బిటార్ జీవితకాలంను మరో ఆరేళ్లు పొడిగించింది. చంద్రుడి ఉపరితలంపై లేదా చంద్రుడికి సంబంధించిన విషయాలను ఫోటోలు తీసి ఆర్బిటార్ భూమికి పంపుతుంది. దాని ఆధారంగా మరికొన్ని ప్రయోగాలు చేయొచ్చని ఇస్రో అభిప్రాయపడింది. సాధారణంగా ఆర్బిటార్ జీవితకాలం ఒక ఏడాది వరకే రూపొందించింది.

మనోహర్ ఖట్టారా.. మజాకా.. కిరీటం పెట్టబోవడమే పాపమా... తల నరుకుతామని బెదిరింపులు....( వీడియో)మనోహర్ ఖట్టారా.. మజాకా.. కిరీటం పెట్టబోవడమే పాపమా... తల నరుకుతామని బెదిరింపులు....( వీడియో)

ఆర్బిటార్‌లో మిగిలిన ఇందనం

ఆర్బిటార్‌లో మిగిలిన ఇందనం

చంద్రుడిపైకి వెళుతున్న సమయంలో ఆర్బిటార్ యొక్క ఇందనంను ఆదాచేయడంలో ఇస్రో శాస్త్రవేత్తలు సక్సెస్ అయ్యారు. తద్వారా ఆర్బిటార్ జీవితకాలం పెంచేందుకు వీలుపడిందని ఇస్రో పేర్కొంది. జూలై 22న చంద్రుడిపైకి టేకాఫ్ తీసుకున్న సమయంలో ఆర్బిటార్‌లో 1697 కిలోల ఇందనంను ఏర్పాటు చేశారు శాస్త్రవేత్తలు. ఇప్పుడు దాదాపు 500 కేజీల ఇందనం మిగిలే ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పుడు ఈ మిగులు ఇందనం మరో ఏడేళ్ల పాటు ఆర్బిటర్ సేవలందించేందుకు సరిపోతుందని చెప్పారు.

చంద్రయాన్ -2లో ఉన్న ఇందనంతోనే సాధ్యం

చంద్రయాన్ -2లో ఉన్న ఇందనంతోనే సాధ్యం

ఆగష్టు 20న చంద్రయాన్ -2 భూమి కక్ష్యను వీడి చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ తర్వాత క్రమంగా కక్ష్యను తగ్గించుకుంటూ సెప్టెంబర్ 1న చంద్రుడి తొలి కక్ష్యలోకి ప్రవేశించింది. ఆ సమయంలో చంద్రుడికి 100 కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్-2 ఉన్నింది. ఇక ఈ సవాళ్లను అన్నిటినీ అధిగమించేందుకు చంద్రయాన్-2లో ఉన్న ఇందనం ద్వారానే సాధ్యమైంది. ఇక జాబిల్లిపై చివరి కక్ష్యలోకి ప్రవేశించే సమయానికి చంద్రయాన్-2లో 500 కిలోల ఇందనం మిగిలే ఉన్నింది. ఇక ఇందనం మిగిలి ఉండటంతో శాస్త్రవేత్తలు ఆర్బిటార్ జీవితకాలంను పెంచేందుకు వినియోగించేలా ప్లాన్ రూపొందించి విజయం సాధించారు.

శాస్త్రవేత్తల తదుపరి కార్యాచరణ ఏంటి..?

శాస్త్రవేత్తల తదుపరి కార్యాచరణ ఏంటి..?

ఇక చంద్రయాన్-2 ఆర్బిటార్ ఏడేళ్ల పాటు సేవలందిస్తుందని ఇస్రో ప్రకటించడంతో ఇక స్పేస్‌క్రాఫ్ట్‌లో పలు మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది. ఆర్బిటార్ ప్రస్తుతం చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. ఒకవేళ అనుకోని సంఘటనలు ఎదురైతే... చంద్రయాన్-2 కక్ష్యను పెంచడం లేదా తగ్గించడం జరుగుతుంది. అయితే ఇందుకు ఇందనంను మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. చంద్రయాన్-2 మిషన్‌లో మొత్తం ఆర్బిటార్‌ది కీలక పాత్ర. ఇది 8 పేలోడ్లను తనలో ఇమడ్చుకుని మోసుకెళ్లింది.ఒక్కో పేలోడ్ ఒక్కో రకమైన ప్రయోగం చేయనుంది. చంద్రుడి ఉపరితలంపై పరీక్షలు, చంద్రుడిపై ఖనిజాల పరిశోదనలతో పాటు చంద్రుడి వాతావరణం కూడా స్టడీ చేయనున్నాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన ప్రయోగం చంద్రుడిపై ఉన్న నీటి ఆనవాలను పసిగట్టడం. దీన్ని గుర్తించేందుకు కూడా ఓ పేలోడ్‌ ఉంది.

రోజులు తగ్గిపోతుండటంతో తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు

రోజులు తగ్గిపోతుండటంతో తీవ్రంగా శ్రమిస్తున్న శాస్త్రవేత్తలు

ఇక భూమితో ల్యాండర్‌కు సంబంధాలు తెగిపోయి ఇప్పటికే నాలుగు రోజులు గడుస్తున్నాయి. సాధారణంగా ల్యాండర్‌ అందులోని రోవర్ 14 రోజుల పాటు చంద్రుడిపై ఉన్న వాతావరణం ఇతర అంశాలను స్టడీ చేసి సమాచారంను భూమికి చేరవేయాల్సి ఉండగా ల్యాండర్‌తో సంబంధాలు తెగిపోవడం వల్ల రోవర్ బయటకు రాలేకపోయింది. ఇక సమయం కూడా మించిపోతుండటంతో శాస్త్రవేత్తలు ల్యాండర్ నుంచి సంకేతాలు పునరుద్ధరించడం కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే ఆర్బిటార్ సురక్షితంగా ఉండటం వల్ల ఇంకా ఏదో ఆశ మిగిలే ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

English summary
The Chandrayaan-2 mission may have received a setback with the Vikram lander losing contact with Earth during its attempt to land on the Moon last Saturday. However, there is an encouraging news for the Indian Space Research Organisation (Isro)the Chandrayaan-2 orbiter's mission life has been extended by a whopping six years.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X