వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్‌పై ఇస్రో తాజా ప్రకటన ఇదే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: చంద్రయాన్ 2కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తాజాగా మరో ప్రకటన చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 2లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ సేఫ్‌గా ఉందని ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విక్రమ్ ల్యాండర్‌కు సంబంధించిన సిగ్నల్స్ మాత్రం అందడం లేదని తెలిపింది.

విక్రమ్ ల్యాండర్ అంటూ ఫేక్ ఫొటోలు వైరల్: అసలు అదేంటంటే..?విక్రమ్ ల్యాండర్ అంటూ ఫేక్ ఫొటోలు వైరల్: అసలు అదేంటంటే..?

చంద్రుడిపై హార్డ్ ల్యాండ్ అయిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ తెలిసింది కానీ.. దానితో ఎటువంటి కమ్యూనికేషన్ జరగలేదని ఇస్రో తాజాగా ప్రకటించింది. అయితే, విక్రమ్ ల్యాండర్‌తో కమ్యూనికేషన్ పునరుద్ధరణకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నట్లు అధికారిక ట్విట్టర్ ద్వారా ఇస్రో వెల్లడించింది.

Chandrayaan-2: Isro has located lander Vikram and is now trying to make contact

విక్రమ్ ల్యాండర్ హార్డ్ ల్యాండ్ అయినప్పటికీ ల్యాండర్ ముక్కలు కాలేదని, బాగానే ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది. ప్రజ్ఞాన్ రోవర్ ల్యాండర్ లోపలే ఉందన్ని వెల్లడించిన ఇస్రో.. ఇది నిర్దేశిత ల్యాండింగ్ ప్రాంతానికి కొద్ది దూరంలో ఓ పక్కకి ఒరిగిపోయిందని పేర్కొంది.

సెప్టెంబర్ 7న ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ -2 చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కావాల్సి ఉండగా.. సాంకేతిక లోపం కారణంగా 2.1కి.మీ దూరంలో ఉండగా సిగ్నల్స్ నిలిచిపోయాయి. కొద్ది సేపటి వరకు సిగ్నల్స్ వస్తాయని ప్రయత్నించిన ఇస్రో శాస్త్రవేత్తలు చివరకు విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు రావడం లేదని ప్రకటించారు. తాజాగా, విక్రమ్ ల్యాండర్ ఆచూకీ లభించడంతో కాంటాక్ట్ అయ్యేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తున్నామని ఇస్రో ప్రకటించింది.

English summary
In a statement issued this morning Isro said: "Vikram lander has been located by the orbiter of Chandrayaan-2, but no communication with it yet. All possible efforts are being made to establish communication with lander."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X