వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2: అసలు విక్రమ్ ల్యాండర్ విషయంలో ఎక్కడ పొరపాటు జరిగింది?

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం లక్ష్యాన్ని చేరుకోకపోవడంపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) విశ్లేషణలు కొనసాగిస్తోంది. చంద్రయాన్ 2 ప్రయోగంలో అత్యంత కీలకమైన విక్రమ్ ల్యాండర్‌ను చంద్రుడిపై సురక్షితంగా దించడంలో ఎలా విఫలం చెందామని విషయాలపై శోధిస్తున్నారు.

చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?చంద్రయాన్2 విఫలం కాలేదు!: విక్రమ్ ల్యాండర్ ఏం చేస్తోంది? 95శాతం విజయవంతమేనా?

అలా ఎందుకు జరిగింది?

అలా ఎందుకు జరిగింది?

చంద్రుడిపై దిగే క్రమంలో విక్రమ్ ల్యాండర్ గతి తప్పి అక్కడి ఉపరితలాన్ని బలంగా ఢీకొట్టడానికి గల కారణాలను తెలుసుకునే పడ్డారు ఇస్రో శాస్త్రవేత్తలు. విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగేందుకు తాము చేసిన అంచనాల్లో వైరుధ్యాలు ఎలా చోటు చేసుకున్నాయనేదానిపై విశ్లేషిస్తోంది.

లోపాన్ని గుర్తించే పనిలో..

లోపాన్ని గుర్తించే పనిలో..

భూ కేంద్రంతో సంబంధాలు తెగిపోవడానికి ముందు ల్యాండర్ పంపిన డేటా ఆధారంగా ఊహాజనిత కారణాలను పరిగణలోకి తీసుకుంటూ పలు సిమ్యులేషన్ రూపొందించింది. దీని ద్వారా విక్రమ్ ల్యాండర్ లో తలెత్తిన లోపాన్ని నిర్ధిష్టంగా గుర్తించే అవకాశం ఉంది.ఇందుకు సంబంధించిన పనిలో ఇస్రో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.

పొరపాటు ఎక్కడ జరిగింది.?

పొరపాటు ఎక్కడ జరిగింది.?

ప్రయోగానికి ముందు నిర్వహించిన ఏదైనా సిమ్యూలేషన్ ను ఆ తర్వాత విస్మరించామా?, లేక పరీక్షల సమయంలో తలెత్తిన ఏదైనా పొరపాటును పరిగణలోకి తీసుకోలేదా? అనే విషయాలపై దృష్టి సారించింది. విక్రమ్ ల్యాండర్ నుంచి సంకేతాలు నిలిచిపోవడం, హార్డ్ ల్యాండ్ అవడం లాంటి పరిణామాలపై ఇస్రో లోతుగా శోధిస్తోంది.

ఒకవేళ ఇలా జరిగితే..

ఒకవేళ ఇలా జరిగితే..

ఒక వేళ విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై సేఫ్‌గా ల్యాండ్ అయితే అందులోని ప్రజ్ఞాన్ రోవర్ బయటికి వచ్చేది. ఆ తర్వాత అది అక్కడి పరిస్థితులపై ఆరా తీసి, ఆ సమాచారాన్ని ఇస్రోకు పంపేది. ఇలా జరిగివుంటే చంద్రయాన్ 2 విజయవంతమయ్యేది. కానీ, విక్రమ్ ల్యాండర్ హార్డ్‌ల్యాండ్ కావడంతో ఇస్రోకు దాన్నుంచి ఎలాంటి సమాచారం లేకుండా పోయింది.

English summary
There was plenty riding on Vikram, India’s squat moon lander, before its precision landing on the lunar surface on September 7 went mysteriously awry.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X