వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఈ నెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం

|
Google Oneindia TeluguNews

Recommended Video

Chandrayaan 2 Likely On July 22 | ఈ నెల 22న చంద్రయాన్ 2 ప్రయోగం!! | Oneindia Telugu

శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ.. ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్ 2 ప్రయోగం వచ్చేవారం జరగనుంది. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 2.43గంటలకు ప్రయోగించనున్నట్లు ఇస్రో ప్రకటించింది. దీనికి సంబంధించి ఆదివారం సాయంత్రం 6.43గంటలకు కౌంట్‌డౌన్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

వాస్తవానికి ఈ నెల 15వ తేదీ తెల్లవారుజామున 2.51గంటలకు చంద్రయాన్ 2 ప్రయోగం నిర్వహించాల్సి ఉంది. అయితే రాకెట్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో ప్రయోగాన్ని నిలిపివేశారు. ప్రయోగ సమయానికి 56నిమిషాల 24 సెకన్ల ముందు కౌంట్‌డౌన్‌ను అర్థంతరంగా నిలిపివేశారు. జీఎస్ఎల్ మార్క్ 3 ఎం1 రాకెట్‌లోని క్రయోజనిక్ దశలో ఏర్పడిన సాంకేతిక లోపం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

Chandrayaan-2 likely on july 22

రాకెట్‌లో తలెత్తిన సాంకేతిక లోపాన్ని సవరించి మళ్లీ ప్రయోగానికి సిద్ధం చేస్తున్నారు. క్రయోజనిక్ దశలోని గ్యాస్ బాటిల్స్ నుంచి ట్యాంకుకు వెళ్లే పైపులు బయట నుంచి లీకేజీ కావడంతో దాన్ని సరిదిద్దారు. 15వ తేదీన లీకైన 25టన్నుల లిక్విడ్ ఆక్సిజన్, హైడ్రోజన్‌ను ఇస్రో సైంటిస్టులు తొలగించారు. అనంతరం నైట్రోజన్ వ్యాపర్స్ సాయంతో ట్యాంకులోని ఇంధనపు పొరలు తొలగించారు. సాంకేతిక లోపాన్ని సవరించి వారం రోజుల వ్యవధిలోనే మళ్లీ ప్రయోగానికి రాకెట్‌ను సిద్ధం చేశారు.

English summary
The Indian Space Research Organisation has rectified the ‘minor’ technical snag in Cryogenic Upper Stage of GSLV-MkIII, which forced authorities to call-off Chandrayaan-2 mission on Monday. The authorities are now planning to launch the lunar mission on July 22.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X