వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ల్యాండింగ్ మాత్రమే ఉంది: చంద్రుడి కక్ష్యలో అన్ని సవాళ్లను అధిగమించిన చంద్రయాన్ 2

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: జూలై 22న భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో చంద్రుడిపైకి పంపిన చంద్రయాన్ -2 జాబిల్లి కక్ష్యలోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే కక్ష్యకు సంబంధించిన అన్ని సవాళ్లను చంద్రయాన్ -2 అధిగమించిందని ఇస్రో వెల్లడించింది. ఇక చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవ ప్రాంతంలో ల్యాండ్ అయ్యేందుకు సిద్దంగా ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరుపడినప్పటి నుంచి వాటిని దిగువ కక్ష్యకు దింపే సవాలును అధిగమించినట్లు ఇస్రో వెల్లడించింది. అనుకున్న సమయానికే ఈ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది.

తొలి ప్రయత్నంలోనే చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయి చరిత్ర సృష్టించేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే చంద్రుడిపై విక్రమ్ అనే ఈ ల్యాండర్ సెప్టెంబర్ 7 తెల్లవారుజామున 1.40 గంటల నుంచి 1.55 గంటల మధ్య జరగనుంది. ఇదిలా ఉంటే ఈ రోజు ఉదయం చిట్టచివరిదైన రెండో సవాలు విజయవంతంగా అధిగమించింది.దీంతో వేరుపడిన ల్యాండర్ చంద్రుడి వైపు ల్యాండ్ అయ్యే దిశలో పయనిస్తోందని ఇస్రో వెల్లడించింది.

 Chandrayaan 2 mission completes all its orbit manoeuvres around the Moon

ఇక తొలి కక్ష్య తగ్గింపు సవాలును అధిగమించిన 19 గంటలకు రెండవ కక్ష్య తగ్గింపు సవాలును ఇస్రో అధిగమించింది. ఇది చంద్రయాన్ -2 ఆర్బిటార్ నుంచి విక్రమ్ ల్యాండర్ వేరుపడిన తర్వాత ఇది జరిగింది. ఇదిలా ఉంటే చంద్రయాన్-2 చంద్రుడికి అత్యంత సమీపంలో జాబిల్లి చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రయాణిస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇప్పటి వరకు ఆర్బిటర్ మరియు ల్యాండర్ విక్రమ్ పనితీరు అంతా సవ్యంగానే ఉన్నట్లు ఇస్రో వెల్లడించింది. సెప్టెంబర్ 7వ తేదీన విక్రమ్ ల్యాండర్‌కు తెల్లవారు జామున 1 గంట నుంచి 2 గంటల మధ్య చార్జింగ్ ప్రక్రియ జరుగుతుందని తెలిపిన ఇస్రో ఆ తర్వాత అంటే 1:30 నుంచి 2:30 గంటల మధ్య సేఫ్ ల్యాండింగ్ ప్రక్రియ జరుగుతుంది.

సెప్టెంబర్ 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోడీ ఈ ప్రక్రియను ప్రత్యక్ష్యంగా వీక్షిస్తారని తెలుస్తోంది. చంద్రుడిపై ల్యాండర్ ల్యాండ్ అయ్యే 15 నిమిషా ముందు ప్రక్రియ చాలా టెన్షన్‌తో కూడుకున్న పని అని ఇస్రో ఛైర్మెన్ డాక్టర్ శివన్ తెలిపారు. ఎందుకంటే ఇంతకు మునుపెన్నడూ చంద్రుడిపై సురక్షితమైన ల్యాండింగ్ చేసిన అనుభవం ఇస్రోకు లేదని తెలిపారు. అయితే పదేళ్ల క్రితం చంద్రుడిపైకి వెళ్లిన చంద్రయాన్ 1 జాబిల్లి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టగలిగామని చెప్పారు. ఇక ల్యాండర్ ల్యాండ్ అయిన తర్వాత రోవర్ తెల్లవారుజామున 5:30 గంటల నుంచి 6:30 గంటలకు విక్రమ్ నుంచి వేరుపడుతుందని చెప్పారు. వేరుపడిన వెంటనే ప్రగ్యాన్ ప్రయోగాలను ప్రారంభిస్తుందని శివన్ చెప్పారు.

English summary
The Chandrayaan 2 mission has completed all its orbit manoeuvres around the Moon and is ready to land close to the lunar south pole. The two orbit lowering manoeuvres, since the lander 'Vikram' separating from the orbiter, were performed at its designated times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X