వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2 ఈ ఏడాదే: చంద్రుడిపైకి తొలిసారిగా ‘ఇస్రో’ రోవర్, 14 రోజులపాటు పరిశోధన!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

బెంగళూరు: అంతరిక్ష పరిశోధనలో ఇప్పటికే ఎన్నో మైలురాళ్లను అధిగమించిన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఇప్పుడు మరో చారిత్రాత్మక ప్రయోగానికి సిద్ధమవుతోంది. తొలిసారి చంద్రుడిపైన ఓ రోవర్‌ను దించబోతోంది.

ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 మిషన్‌ ద్వారా ఈ ఏడాది ఏప్రిల్‌లో చంద్రుడిపైకి మన శాస్త్రవేత్తలు ఈ రోవర్‌ను దింపబోతున్నారు. ఈ ప్రతిష్టాత్మక చంద్రయాన్ -2 ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు.

చంద్రుడిపై నీటిజాడలను కొనుగొన్న చంద్రయాన్-1...

చంద్రుడిపై నీటిజాడలను కొనుగొన్న చంద్రయాన్-1...

చంద్రుడిపై ఇస్రో పరిశోధనలు ఇది తొలిసారి కాదు. 2008లోనూ శ్రీహరికోట నుంచి లాంచ్ అయిన చంద్రయాన్-1ను చంద్రుడి కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టింది మన ఇస్రో. ఇది చంద్రునిపై నీటి జాడను కూడా కొనుగొంది.

 చంద్రుడిపైకి రోవర్ ప్రయోగం...

చంద్రుడిపైకి రోవర్ ప్రయోగం...

ఇప్పుడు చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా చంద్రునిపై ఏకంగా ఓ రోవర్‌ను దించాలనేది ఇస్రో లక్ష్యం. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సంబంధించిన వివరాలను ఇస్రో చైర్మన్ కే శివన్ వెల్లడించారు. ఇప్పటికే చంద్రునిపై రోవర్‌ను దించడానికి రెండు ప్రదేశాలను పరిశీలించామని, గతంలో ఏ రోవర్ దిగని ప్రదేశంలో చంద్రయాన్-2 రోవర్‌ను దింపబోతున్నామని ఆయన తెలిపారు.

 ఏప్రిల్‌లో శ్రీహరికోట నుంచి...

ఏప్రిల్‌లో శ్రీహరికోట నుంచి...

ఈ ఏడాది ఏప్రిల్‌లో శ్రీహరికోట రాకెట్ కేంద్రం నుంచి చంద్రయాన్-2ను ప్రయోగించనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి అది చంద్రుని కక్ష్యలోకి చేరడానికి ఒకటి నుంచి రెండు నెలల సమయం పడుతుందని ఇస్రో చైర్మన్ శివన్ తెలిపారు.

 14 రోజులపాటు తిరగనున్న రోవర్...

14 రోజులపాటు తిరగనున్న రోవర్...

చంద్రయాన్-2 ప్రయోగంలో జీఎస్‌ఎల్‌వీ ఎంకే 2 రాకెట్‌ను ఉపయోగించనున్నారు. ‘చంద్రుని ఉపరితలంపై 14 రోజులపాటు తిరుగాడేలా రోవర్‌ను రూపొందించాం. ఇది చంద్రునిపై 150 నుంచి 200 కిలోమీటర్ల మేర తిరుగుతుంది. అక్కడి ఉపరితలంపై రసాయన విశ్లేషణ చేస్తుంది..' అని ఇస్రో చైర్మన్ శివన్ వెల్లడించారు.

ప్రయోగం ఇలా జరుగుతుంది...

ప్రయోగం ఇలా జరుగుతుంది...

చంద్రయాన్-2 బరువు మొత్తం 3290 కిలోలు. ఇందులో ఆర్బిటర్, ల్యాండర్, రోవర్ ఉంటాయి. చంద్రుని కక్ష్యకు వంద కిలోమీటర్ల దూరంలో ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరవుతుంది. ఆ తర్వాత అది రోవర్‌ను చంద్రుని ఉపరితలంపై దించుతుంది.

Recommended Video

Lunar Eclipse Timelapse | Oneindai Telugu
 మొత్తం మూడు మానవరహిత వెహికిల్స్‌...

మొత్తం మూడు మానవరహిత వెహికిల్స్‌...

ఈ మిషన్ కోసం ప్రస్తుతం ఇస్రో మూడు మానవరహిత వెహికిల్స్‌ను రూపొందించడంపై పని చేస్తోంది. ఇందులో ఒకటి ఆర్బిటర్ క్రాఫ్ట్. ఇది చంద్రునిపై కొంత ఎత్తులో తిరుగుతూ ఉంటుంది. ఒక రోవర్, ఆ రోవర్‌ను చంద్రునిపై సురక్షితంగా దించేలా ఒక ల్యాండర్‌ను ఇస్రో శాస్త్రవేత్తలు రూపొందిస్తున్నారు.

 ఆర్బిటర్ ద్వారా డేటా అంతా భూమికి...

ఆర్బిటర్ ద్వారా డేటా అంతా భూమికి...

చంద్రయాన్-2 ప్రాజెక్టులో భాగంగా ఆరు టైర్లున్న రోవర్ చంద్రునిపై ల్యాండవుతుంది. ఇది సెమీ ఆటానమస్ మోడ్‌లో ఉంటుంది. భూమి నుంచి ఇచ్చే కమాండ్స్ ఆధారంగా రోవర్ అటూ ఇటూ తిరుగుతుంది. చంద్రుని ఉపరితలానికి సంబంధించిన డేటాను సేకరించి భూమికి చేరవేస్తుంది. చంద్రయాన్-2 ఆర్బిటర్ ద్వారా ఈ డేటా అంతా భూమిని చేరుతుంది. ఆ డేటాకు సంబంధించిన విశ్లేషణ అంతా ఇస్రోలో జరుగుతుంది.

English summary
Gearing up for its most challenging space mission, Indian Space Research Organisation (Isro) is leaving no stone unturned to make the Chandrayaan-2 (lunar-2) mission a success. Unlike the first lunar mission when a PSLV rocket carried the spacecraft to the moon's orbit, this time heavy-payload lifter GSLV Mk II will launch the spacecraft weighing 3,290kg as the module will carry an orbiter, a rover and a lander to the moon. Giving exclusive details about the mission, Isro chairman Dr K Sivan told TOI, "Chandraayan-2 is a challenging mission as for the first time we will carry an orbiter, a lander and a rover to the moon. The launch date schedule is sometime in April. Once the GSLV rocket carrying the spacecraft is launched from Sriharikota, the orbiter will reach the moon's orbit in one to two months. (The moon's orbit is 3,82,000km away from the earth's surface)."
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X