వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2 మరో కీలక ఘట్టం విజయవంతం: చంద్రుని కక్ష్యలోకి విక్రమ్ ల్యాండర్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత అంతరిక్ష రక్షణ, పరిశోధనా సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మక చేపట్టిన చంద్రయాన్-2 ప్రాజెక్టులో మంగళవారం మరో కీలక ఘట్టం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయం 8.50గంటలకు చంద్రుని చుట్టూ తిరుగుతున్న దూరాన్ని ఆర్బిటర్ తగ్గించుకుంది. నాలుగు సెకన్లపాటు ప్రొపల్షన్ వ్యవస్థను ఆన్ చేయడం ద్వారా కక్ష్య దూరాన్ని తగ్గించినట్లు ఇస్రో వెల్లడించింది.

మేం ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించం: ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలుమేం ముందుగా అణ్వాయుధాలను ఉపయోగించం: ఇమ్రాన్ ఖాన్ కీలక వ్యాఖ్యలు

చంద్రుని చుట్టూ..

ఈ అంతరిక్ష నౌకలోని ఆర్బిటర్ నుంచి విక్రమ్ ల్యాండర్ సోమవారం మధ్యాహ్నం 1.15కు విడిపోయింది. ప్రస్తుతం విక్రమ్ ల్యాండర్ 104/128 కిలోమీటర్ల దూరంలో చంద్రుని చుట్టూ పరిభ్రమిస్తోందని, తదుపరి డీ-ఆర్బిటింగ్‌ను బుధవారం తెల్లవారుజామున 3.30 నుంచి 4.30గంటల మధ్య చేపడతామని తెలిపింది.

 చంద్రయాన్ 2 విజయవంతం..

చంద్రయాన్ 2 విజయవంతం..

ఆ తర్వాత మూడు రోజుల(సెప్టెంబర్ 7న)కు ఆర్బిటర్ నుంచి విడిపోయే విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై అడుగుపెట్టడం ద్వారా చంద్రయాన్-2 విజయవంతంగా పూర్తవుతుందని వెల్లడించారు.

సెప్టెంబర్ 7న అంతిమ ఘట్టం

సెప్టెంబర్ 7న అంతిమ ఘట్టం

శ్రీహరికోట నుంచి జులై 22న నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 కొద్దిరోజులపాటు భూకక్ష్యలో పరిభ్రమించింది. ఆ తర్వాత ఆగస్టు 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది. సెప్టెంబర్ 7న అంతిమ ఘట్టం విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై అడుగుపెట్టడం జరుగుతుంది.

నీటి జాడలున్నాయా?

చంద్రుడి సౌత్ పోలార్ ప్రాంతంలో ఈ ల్యాండర్ ప్రవేశం జరుగుతుంది. చంద్రుడిపై నీటి జాడలు కనుగొనడంతోపాటు సొలార్ సిస్టమ్ ఎలా ఉందో తెలుసుకొని.. మనుగడకు వీలయ్యే పరిస్థితులు అక్కడున్నాయా? అనే విషయాలను తెలియజేస్తుంది.

English summary
The Chandrayaan-2 lander and rover lowered their orbit around the Moon a day after breaking from the Chandrayaan-2 orbiter and starting their own journey to the lunar surface.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X