వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చంద్రయాన్-2 లేటెస్ట్ అప్ డేట్: సౌర గాలుల ప్రభావం: ఆర్బిటర్..ఫుల్ ఛార్జ్

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: చంద్రయాన్-2 మిషన్ పై భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) లేటెస్ట్ అప్ డేట్ ను ప్రకటించింది. ఈ మిషన్ లో భాగంగా చంద్రుడి మీదికి ప్రయోగించిన ఆర్బిటర్ సౌర గాలుల ప్రభావానికి లోనైనట్లు వెల్లడించింది. ఆర్బిటర్ లో అమర్చిన పేలోడ్స్, కొన్ని రకాల కణాలు.. సౌర గాలుల వల్ల ఛార్జ్ అయ్యాయి. దీని ప్రభావం ఆర్బిటర్ జీవిత కాల పరిమితిపై పడుతుంది. సూర్యుడి నుంచి అనుక్షణం వెలువడుతూ ఉండే భీకర సౌర గాలుల్లో ఎలక్ట్రాన్స్, ప్రొటాన్స్, అతినీల లోహిత కిరణాలను ఆర్బిటర్ లో అమర్చిన క్లాస్ అనే పరికరం స్వీకరించిందని, ఫలితంగా అందులో ఉండే చిన్న చిన్న కణాలు అణు ధార్మిక శక్తికి గురయ్యాయని పేర్కొంటూ ఇస్రో శాస్త్రవేత్తలు ఓ ట్వీట్ చేశారు.

సౌర గాలుల ప్రభావానికి ఛార్జ్..

సౌర గాలుల ప్రభావానికి ఛార్జ్..

చంద్రయాన్ 2 ప్రాజెక్టులో భాగంగా ప్రయోగించిన ఆర్బిటర్ లో అమర్చిన ఈ పేలోడ్.. అణు ధార్మిక శక్తిని గ్రహించేలా డిజైన్ చేశారు శాస్త్రవేత్తలు. సోడియం, కాల్షియం, అల్యూమినియం, సిలికాన్, టైటానియం, ఇనుము మిశ్రమంతో క్లాస్ పరికరాన్ని రూపొందించారు. సెకెనును కొన్ని వందల కిలోమీటర్ల వేగంతో వీచే సూర్యుడి నుంచి వెలువుడే సౌర గాలుల ప్రభావంతో క్లాస్ లోని కణాలన్నీ ఛార్జ్ అయ్యాయని, ఇది కొంత సానుకూల విషయమేనని ఇస్రో శాస్త్రవేత్తలు వెల్లడించారు. విక్రమ్ ల్యాండర్ జాడ తెలియరానప్పటి నుంచీ, దాన్ని అన్వేషించడానికి ఆర్బిటర్ ను నిరంతరాయంగా వినియోగించుకుంటున్నారు శాస్త్రవేత్తలు.

అదొక్కటే శాస్త్రవేత్తల ఆశ..

అదొక్కటే శాస్త్రవేత్తల ఆశ..

చంద్రుడి దక్షిణ ధృవం వైపు ప్రయాణించిన విక్రమ్ ల్యాండర్ ఉపరితలానికి 2.1 కిలోమీటర్ల ఎత్తున ఉన్న సమయంలో గల్లంతైన విషయం తెలిసిందే. సుమారు నెలరోజులు కావస్తున్నప్పటికీ విక్రమ్ ల్యాండర్ జాడ తెలియరాకుండా పోయింది. ఈ పరిస్థితుల్లో ఇస్రో శాస్త్రవేత్తలు ప్రస్తుతం ఆర్బిటర్ ను మాత్రమే నమ్ముకున్నారు. ఇప్పటికే ఆర్బిటర్ ను నిర్దేశిత చంద్రుడి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఇది చంద్రుడి చుట్టూ పరిభ్రమిస్తోంది. ఈ క్రమంలో జాబిల్లిపై నీటి ఆనవాళ్లను పరిశీలిస్తోంది. చంద్రుడి ఉపరితలం లోతుల్లో ఉండే ఖనిజాలను వివరాలను సేకరిస్తోంది.

ఒత్తిడిని తట్టుకుని.. ఫుల్ ఛార్జ్

ఒత్తిడిని తట్టుకుని.. ఫుల్ ఛార్జ్

ఈ పనులన్నీ అది సజావుగా చేయాలంటే.. అందులో పేలోడ్ రూపంలో అమర్చిన క్లాస్ అనే పరికరం కీలకంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ ఆర్బిటర్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టింది. విక్రమ్ ల్యాండర్ ల్యాండ్ అయినట్టుగా భావిస్తోన్న ప్రదేశంపై అణువణువూ గాలించింది. ఫలితంగా- నిర్దేశిత ప్రమాణాల కంటే అధికంగా ఆర్బిటర్ ఒత్తిడికి గురైందని, సౌర గాలుల ప్రభావం వల్ల అది మళ్లీ పూర్వ స్థితికి చేరుకుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. చంద్రుడి ఉపరితలంపై పడే సౌర కిరణాల ప్రభావం వల్ల విక్రమ్ ల్యాండర్ కూడా అదే తరహాలో ఛార్జ్ అయ్యే అవకాశాలు లేకపోలేదని అభిప్రాయపడుతున్నారు. చంద్రుడి కక్ష్యలో పరిభ్రమిస్తూ, దాని చుట్టూ చక్కర్లు కొట్టే సమయంలో ఆర్బిటర్ సౌర గాలుల నుంచి వెలువడే ప్లాస్మా ఒత్తిడికి గురైనట్లు భావించామని, అదే సమయంలో అందులోని చిన్న, చిన్న పరికరాలు, ఇతర కణాలు ఛార్జ్ అయ్యాయని పేర్కొన్నారు.

English summary
Chandrayaan2’s Orbiter payload, in its first few days of observation, detected charged particles, and its intensity variations, the Indian Space Research Organisation (ISRO) said on Thursday. The space agency in a tweet said, “CLASS, #Chandrayaan2’s Orbiter payload, in its first few days of observation, could detect charged particles and its intensity variations during its first passage through the geotail during Sept.”
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X