వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీయే ఛైర్మ‌న్‌గా చంద్రబాబు..? ప్రతిపాదిస్తున్న బీజేపీఏతర నేతలు..!!

|
Google Oneindia TeluguNews

Recommended Video

యూపీయే ఛైర్మ‌న్‌గా చంద్రబాబు..? || Oneindia Telugu

హైదరాబాద్ : భారత్ తో పాటు ప్ర‌పంచంలోని ఎన్నో దేశాలు ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు ఈ నెల 23న వెలువ‌డ‌నున్నాయి. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుస్తారు.. ఎవ‌రు ఓడ‌తారు.. అన్న‌ది ప‌క్క‌న పెడితే.. ఎన్‌డీయే, యూపీయే నేత‌లు ఇప్ప‌టి నుంచి అధికారం కోసం వ్యూహ‌ప్ర‌తివ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఎన్‌డీయే అధికారంలోకి వ‌స్తే మోడీ ప్ర‌ధాని కావ‌డం ఖాయ‌మైన‌ట్టే..! మ‌రి ఇదే స‌మ‌య‌లో యూపీఏ-3 అధికారంలోకి వ‌స్తే ఎవ‌రు ప్ర‌ధాని అవుతార‌న్న‌ది హ‌స్తిన వేదిక‌గా జోరుగా చ‌ర్చ జ‌రుగుతోంది. దీనికి ఈ నెల 21న జ‌రిగే బీజేపీయేత‌ర ప‌క్షాల స‌మావేశంలో ఓ స్ప‌ష్ట‌త వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ.. కాంగ్రెస్ కి మెజార్టీ వస్తే రాహుల్ ప్రధాని అవుతారు . కానీ కాంగ్రెస్ కి పూర్తి మెజార్టీ వచ్చే అవకాశాలు లేవు. ఇలాంటి పరిస్థితే వస్తే ఏం చేయాలనేదానిపై కాంగ్రెస్ దాని మిత్ర పక్షాలు సీరియస్ గా ఆలోచిస్తున్నాయి.

థర్డ్ ఫ్రంట్ కోసం కీలక మార్పులు..! బీజేపిఏతర పక్షాల ఐకమత్యం కోసం బాబు ప్రయత్నాలు..!!

థర్డ్ ఫ్రంట్ కోసం కీలక మార్పులు..! బీజేపిఏతర పక్షాల ఐకమత్యం కోసం బాబు ప్రయత్నాలు..!!

మిత్ర పక్షాలను ఏకతాటిపై నడిపేందుకు ఏపీ ముఖ్య‌మంత్రి, టీడీపి అధినేత నారా చంద్ర‌బాబునాయుడు సరైన వ్యక్తిగా ఆలోచిస్తున్నాయి. బీజేపీయేత‌ర ఫ్రంట్‌లో కాంగ్రెస్ పెద్ద‌న్న పాత్ర పోషించే అవ‌కాశం ఉన్న‌ప్ప‌టికీ, ప్రాంతీయ పార్టీలే కీల‌కం కానున్నాయి. ప్ర‌స్తుతం చంద్ర‌బాబు ప్ర‌తిపాదించిన బీజేపీయేత‌ర ఫ్రంట్‌కు ఎవ‌రూ నాయ‌క‌త్వం వ‌హిస్తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. కాంగ్రెస్ ఉండ‌టం ఈ ఫ్రంట్‌ను ప్ర‌స్తుతం యూపీఏగా అభివ‌ర్ణిస్తున్నారు. యూపీయేకు ప్ర‌స్తుతం ఛైర్‌ప‌ర్స‌న్‌గా సోనియాగాంధీ ఉన్నారు. దాదాపు 20 ఏళ్లుగా ఆమె ఫ్రంట్ ఛైర్‌ప‌ర్స‌న్‌గా కొన‌సాగుతున్నారు. ప్ర‌స్తుతం వ‌యోభారం, అనారోగ్యం కార‌ణంగా ఫ్రంట్ కార్య‌కలాపాల్లో ఎక్కువ‌గా పాల్గొన‌డం లేదు. ప్రస్తుత ఎన్నిక‌ల్లో రాయ్‌బ‌రేలీ నుంచి పోటీ చేస్తున్న‌ప్ప‌టికీ క‌నీసం ప్ర‌చారానికి కూడావెళ్ల‌లేదు. ప్రియాంక గాంధీనే పూర్తిగా ప్ర‌చారం చేప‌ట్టారు. ఈ ప‌రిస్థితుల్లో యూపీయేకు కొత్త ఛైర్మ‌న్ ఎన్నుకోవాల‌ని భాగ‌స్వామ్య ప‌క్షాలు ప్ర‌తిపాదిస్తున్నాయి.

వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్ వేర్వేరు ఉద్యోగాలు.. ఒకే పరీక్ష: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి కొత్త బోర్డు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్

యూపీఏ ఛైర్మన్ గా చంద్రబాబు..! జాతీయ నేతల ప్రతిపాదనలు..!!

యూపీఏ ఛైర్మన్ గా చంద్రబాబు..! జాతీయ నేతల ప్రతిపాదనలు..!!

యూపీయే కొత్త ఛైర్మ‌న్‌గా చంద్ర‌బాబును ఎన్నుకునే అవ‌కాశం క‌నిపిస్తోంది. ఆయ‌న అభ్య‌ర్థిత్వాన్ని నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్సు నేత ఫ‌రూక్ అబ్దుల్లా, ఎన్‌సీపీ అధినేత శ‌ర‌ద్‌ప‌వార్‌, మ‌మ‌త‌బెన‌ర్జీ ప్ర‌తిపాదిస్తున్నారు. దీనికి ఆప్ అధినేత కేజ్రీవాల్‌, వామ‌ప‌క్షాలు కూడా మ‌ద్ద‌తు తెలిపే అవ‌కాశం ఉంది. ఒక‌వేళ కాంగ్రెస్ సార‌థ్య బాధ్య‌త‌లు తీసుకుంటే.. ఎస్పీ, బీఎస్పీతోపాటు ఆప్‌, వామ‌ప‌క్షాలు యూపీయేలో చేరేందుకు ఆస‌క్తి చూప‌క‌పోవ‌చ్చ‌ని చ‌ర్చ న‌డుస్తోంది. కేవ‌లం బ‌య‌ట నుంచి మ‌ద్ద‌తు ఇవ్వొచ్చు. దీనివ‌ల్ల ప్ర‌భుత్వం ఏర్ప‌డితే అది ఎప్పుడు కూలిపోతుందో తెలియ‌దు. దీనికి మ‌ధ్యేమార్గంగా చంద్ర‌బాబును యూపీయే ఛైర్మ‌న్‌గా చేయాల‌ని ఫ్రంట్‌లో చ‌ర్చ న‌డుస్తున్న‌ట్లు స‌మాచారం. గ‌తంలోనూ యునైటెడ్ ఫ్రంట్ క‌న్వీన‌ర్‌గా ప‌నిచేసిన అనుభ‌వం చంద్ర‌బాబుకు ఉంది. ఈ దృష్ట్యా ఆయ‌న పేరును తెర‌పైకి తెచ్చిన‌ట్లు తెలుస్తోంది.

ప్రధాని రేసులో అరడజను మంది..! ఫలితాల తర్వాత కీలక మార్పులు..!!

ప్రధాని రేసులో అరడజను మంది..! ఫలితాల తర్వాత కీలక మార్పులు..!!

ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం ప్ర‌ధాని ప‌ద‌వి రేసులో చంద్ర‌బాబు సార‌థ్యం వ‌హిస్తున్న ఫ్రంట్‌లో అర‌డ‌జ‌న‌కుపైగా నేత‌లు ఉన్నారు. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తి, తృణ‌మూల్ అధినేత్రి మ‌మ‌తాబెన‌ర్జీ, దేవేగౌడ, చంద్ర‌బాబునాయుడు, శ‌ర‌ద్‌పవార్‌, రాహుల్‌గాంధీ స‌హా కీల‌క నేత‌లు ప్ర‌ధాని ప‌ద‌విని ఆశిస్తున్న వారే. ఇందులో మాయావ‌తి, మ‌మ‌తాబెన‌ర్జీ ప్ర‌ధాని ప‌ద‌వికి బాగా పోటీ ప‌డుతున్నారు. యూపీఏ-3కి మెజారిటీ వ‌స్తే కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్‌గాంధీ ప్ర‌ధాని అవుతార‌ని గ‌త కొన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ ప్ర‌తిపాద‌న‌కు మ‌మ‌త‌, మాయావ‌తి సుత‌రామూ అంగీక‌రించ‌డం లేదు. మ‌మ‌త‌బెన‌ర్జీని ఒప్పించ‌గ‌లిగినా.. మాయావ‌తి మాత్రం ఏ మాత్రం ఇష్టప‌డ‌టం లేదు. మాయ‌వ‌తికి ఎస్పీ అధినేత అఖిలేష్‌యాద‌వ్ కూడా వంత పాడుతున్నారు. ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లో కీల‌క‌మైన ఎస్పీ, బీఎస్పీ మ‌ద్ద‌తు లేనిదే.. యూపీఏ-3 అధికారంలోకి రావ‌డం దాదాపు అసాధ్యం. అందుకే మ‌ధ్యేమార్గంగా ప‌శ్చిమ్‌బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తాబెన‌ర్జీని ప్ర‌ధాని అభ్య‌ర్థిగా ప్ర‌తిపాద‌న వ‌చ్చింది. ఈ ప్ర‌తిపాద‌న‌ను స్వ‌యానా నారా చంద్ర‌బాబునాయుడు తెచ్చిన‌ట్లు స‌మాచారం.

యూపీయేకి కీలక నేతగా మారనున్న బాబు..! ఎస్పీ, బీఎస్పీకి చెక్ పెట్టేందుకు వ్యూహం....!!

యూపీయేకి కీలక నేతగా మారనున్న బాబు..! ఎస్పీ, బీఎస్పీకి చెక్ పెట్టేందుకు వ్యూహం....!!

దీనిపై ఇప్ప‌టికే రాహుల్‌గాంధీ వ‌ద్ద చ‌ర్చించిన‌ట్లు తెలిసింది. రాహుల్‌ను ప్ర‌ధానిగా ఎస్పీ, బీఎస్పీ ఒప్పుకోని ప‌క్షంలో మ‌మ‌త పేరును తెర‌పైకి తీసుకురావాల‌ని ప్ర‌తిపాదించారు. మ‌మ‌త అభ్య‌ర్థిత్వాన్ని ఎస్పీ, బీఎస్పీ వ్య‌తిరేకించేందుకు కార‌ణం ఉండ‌దు. దీనివ‌ల్ల మాయావ‌తికి కూడా చెక్ పెట్టిన‌ట్లు అవుతుంది. ఇప్ప‌టికే మాయావ‌తిపై సీబీఐ కేసులు ఉన్న నేపథ్యంలో.. ఆమె కోరిక మేర‌కు ప్ర‌ధాని ప‌ద‌వికి ప్ర‌తిపాదిస్తే ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం స‌న్న‌గిల్ల‌డ‌మే కాకుండా దేశంలో ఒకే వ‌ర్గానికి ప్రాధాన్యం పెరిగిపోతుంద‌న్న భావ‌న యూపీయేలోని కీల‌క‌నేత‌ల్లో వ్య‌క్త‌మైంది. అందుకే ఆమెకు చెక్ పెట్టాలంటే మ‌మ‌త పేరును ప్ర‌ధాని అభ్య‌ర్థిత్వానికి ప‌రిశీలించే ప్ర‌తిపాద‌న‌ను చంద్ర‌బాబు తెర‌పైకి తీసుకువ‌చ్చిన‌ట్లు స‌మాచారం. దీనికి మ‌రింత బ‌లం చేకూరేలా ప‌శ్చిమ బెంగాల్‌లో ప్రచారానికి వెళ్లిన చంద్ర‌బాబు వ్యాఖ్య‌లు ఉండ‌టం విశేషం. ప్ర‌స్తుతం బెంగాల్‌కే టైగ‌ర్‌గా ఉన్న మ‌మ‌తాబెన‌ర్జీ.. ఎన్నిక‌ల త‌ర్వాత దేశానికే టైగ‌ర్ అవుతార‌ని చెప్ప‌డం వెనుక అంత‌రార్థం.. మ‌మ‌త ప్ర‌ధాని కాబోతున్నార‌ని చెప్ప‌క‌నేచెప్పిన‌ట్లుగా భావిస్తున్నారు. అయితే కాంగ్రెస్ మాత్రం ప్రధాని, యూపీయే ఛైర్మ‌న్‌ పదవుల్లో ఒకదాన్ని కచ్చితంగా తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

English summary
AP Chief Minister and TDP chief Nara Chandrababu Naidu is considering the right thing to run the allies. Even though the Congress may play an important role in the non-BJP front, regional parties are crucial. It is interesting that no one will take the lead in the NDA's proposed Non-BJP Front.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X