వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ గాంధీ ట్విటర్ హ్యాండిల్‌లో మార్పులు చేర్పులు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసేందుకు గల కారణాలు వివరిస్తూ ట్విటర్‌లో ఓ లేఖను పోస్టు చేసిన కొద్ది క్షణాల్లోనే అతని ట్విటర్ ప్రొఫైల్‌పై మార్పులు కనిపించాయి. అప్పటి వరకు కాంగ్రెస్ అధ్యక్షుడు అని రాసి ఉన్న ట్విటర్ ప్రొఫైల్‌లో అది కనిపించలేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు అని రాసి ఉన్న డెసిగ్నేషన్‌ను తొలగించారు రాహుల్ గాంధీ. ఇప్పుడు పార్లమెంటేరియన్, మెంబర్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని కనిపిస్తోంది.

2017లో తల్లి సోనియా గాంధీ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు రాహుల్ గాంధీ. 2019 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా దెబ్బతినింది. ఆ పార్టీకి 52 స్థానాలు మాత్రమే దక్కాయి. ఎన్నికల్లో ఓటమికి బాధ్యత వహిస్తూ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందు తాను రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. అయితే పార్టీ అధ్యక్షుడిగా తప్పుకున్న తర్వాత రాహుల్ గాంధీనే కాంగ్రెస్ అధ్యక్షుడిగా కొనసాగాలంటూ చాలామంది ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే బుధవారం మాత్రం తాను రాజీనామా చేస్తున్నట్లు బహిరంగంగానే ప్రకటించారు.

rahul twitter

ఇంతటి ఘోర వైఫల్యంతో తను ఇక పదవిలో కొనసాగలేనని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. పార్టీ ఓటమికి చాలామంది బాధ్యత తీసుకోవాలని ఆయన కోరారు. ఇకపై పార్టీని మరింత పటిష్ట పరచాల్సిన అవసరం ఉందని అన్నారు. అంతేకాదు తన వారసుడిగా తను ఎవరినీ ప్రకటించడంలేదని... అది పార్టీ చూసుకుంటుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఘనచరిత్ర ఉన్న పార్టీ అని పార్టీని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. పార్టీని ఇకపై సమర్థవంతంగా నడింపించగల సత్తా ఉన్న నాయకుడిని పార్టీ ఎన్నుకుంటుందన్న పూర్తి విశ్వాసం తనకుందని అన్నారు రాహుల్ గాంధీ. ఇదిలా ఉంటే కాంగ్రెస్ అధ్యక్షుడిగా మల్లిఖార్జున ఖర్గే కానీ సుషీల్ కుమార్ షిండేను కానీ తమ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ఎన్నుకునే అవకాశం ఉ:ది.

English summary
Rahul Gandhi has removed his designation "President, Indian National Congress" from his Twitter profile after he shared an open letter in which he listed reasons for his resignation as the party chief. Mr Gandhi's account now describes him as a parliamentarian and the "Member of the Indian National Congress".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X