ఉభయసభల్లో గందరగోళం: నోట్ల రద్దుపై ఆందోళనలు
సభ ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు.
న్యూఢిల్లీ: సోమవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంటు సమావేశాల్లో కూడా విపక్షాలు తమ ఆందోళనను కొనసాగించాయి. పెద్దనోట్ల రద్దుపై చర్చ జరపాలంటూ పార్లమెంటు ఉభయసభల్లో గందరగోళం సృష్టించారు.
సభ ప్రారంభమైనప్పటి నుంచి ఈ అంశంపై చర్చ చేపట్టాలని విపక్ష పార్టీల సభ్యులు లోక్‌సభ, రాజ్యసభల్లో డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. రాజ్యసభలో స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. దీంతో సభను వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ ఛైర్మన్ హమీద్ అన్సారీ ప్రకటించారు.

వాయిదాలు పడుతూ రాజ్యసభ కొనసాగుతుండగా, మరోవైపు లోక్‌సభలోనూ ఈ అంశంపై గందరగోళం నెలకొంది. విపక్ష సభ్యులు చేసిన విజ్ఞప్తులను స్పీకర్ సుమిత్రా మహాజన్ తిరస్కరించి ప్రశ్నోత్తరాలు చేపట్టారు. విపక్షాల ఆందోళనల మధ్యే లోకసభ కొనసాగుతోంది.
పెద్ద నోట్ల రద్దు అంశంపై చర్చ జరిపేందుకు తాము సిద్ధమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. విపక్షాల ఆందోళన సరికాదని అన్నారు. విపక్షాలు మాత్రం సభ సజావుగా సాగేందుకు సహకరించడం లేదని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications