వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పక్కనే ఉంటాం, షాకయ్యాం, మరో రెండ్రోజులైనా వేచి చూస్తాం: శ్రీదేవి నివాసం వద్ద..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Sridevi's Mortal At Celebration Sports Club, Watch | Oneindia Telugu

ముంబై: సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్‌లో శ్రీదేవి భౌతికకాయాన్ని దర్శించుకునేందుకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. లోఖండ్‌వాలాలోని ఆమె నివాసం నుంచి ఇక్కడకు తరలించారు.

దీంతో అభిమానులు, ప్రముఖులు కడసారి చూపు కోసం వచ్చారు. చిరంజీవి, ఐశ్వర్యరాయ్, అనిల్ కపూర్, సంజీవ్ కపూర్, సోనమ్ కపూర్, ఊర్వశి, ఆదిత్య థాకరే, సల్మాన్ ఖాన్, హేమమాలిని, అక్షయ్ ఖన్నా, సుస్మితా సేన్ తదితరులు వచ్చారు.

శ్రీదేవి హత్య!: 'స్వామీ! ఇక తగ్గు', తల్లి చివరి చూపు కోసం కూతుళ్లు వెయిటింగ్, ఇంటి వద్ద భద్రతశ్రీదేవి హత్య!: 'స్వామీ! ఇక తగ్గు', తల్లి చివరి చూపు కోసం కూతుళ్లు వెయిటింగ్, ఇంటి వద్ద భద్రత

మీడియాకు ఆంక్షలు

మీడియాకు ఆంక్షలు

శ్రీదేవి భౌతికకాయాన్ని సందర్శించేందుకు ఆమె ఫ్యామిలీ కుటుంబం మీడియా ప్రతినిధులకు అనుమతిచ్చింది. అయితే లోపలికి వచ్చేటప్పుడు కెమెరాలు, వాయిస్‌ రికార్డర్లులాంటి ఎటువంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకురాకూడదని ఆంక్షలు విధించింది. ఎవ్వరూ శ్రీదేవి భౌతికకాయం ఫొటోలను తీయవద్దని కోరారు.

అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!అనుమానాల్లేవు: శ్రీదేవి కేసు క్లోజ్, ఆ 'ఒక్క' ప్రశ్నకే దొరకని సమాధానం, ట్విస్ట్ మీద ట్విస్ట్!

ఫోటోలు తీసుకునేందుకు

ఫోటోలు తీసుకునేందుకు

పోలీసులు, ప్రయివేటు సెక్యూరిటీతో శ్రీదేవి నివాసం వద్ద, సెలబ్రేషన్స్ స్పోర్ట్స్ క్లబ్ వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. శ్రీదేవిని చూసేందుకు అశేష అభిమానులు తరలి వచ్చారు. అంతకుముందు, శ్రీదేవి భౌతికకాయం తరలిస్తుండగా మొబైల్స్‌తో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు.

మరో రెండు రోజులు అయినా వేచి చూస్తాం

మరో రెండు రోజులు అయినా వేచి చూస్తాం

ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఆదిత్య అనే ఇరవై ఏళ్ల అభిమాని మాట్లాడుతూ.. ఆమెకు తాము పెద్ద అభిమానులమని, ఆమెనే తమకు ప్రపంచమని, ఆమెను చూడకుండా మేం ఇక్కడి నుంచి కదలమని, ఇప్పటికే రెండు రోజులు వేచి చూశామని, మరో రెండు రోజులు చూసేందుకు సిద్ధమన్నారు. తాము కుటుంబంతో సహా శ్రీదేవిని చివరిసారిగా చూసేందుకు వచ్చామన్నారు.

పక్కనే ఉంటాం, షాకవుతున్నాం

పక్కనే ఉంటాం, షాకవుతున్నాం

రాహుల్ దీక్షిత్ అనే మరో అభిమాని మాట్లాడుతూ.. నేను ఇక్కడికి సమీపంలోను ఉంటానని, గతంలో రెండుసార్లు చూశానని, కానీ ఇప్పుడు విగతజీవిగా వస్తున్న ఆమెను చూడాల్సి రావడంతో షాక్ అవుతున్నానని చెప్పారు.

English summary
As the ambulance carrying the mortal remains of Bollywood icon Sridevi entered her residence in suburban Andheri, a large number of fans jostled for a glimpse of their favourite actor.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X