వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చరణ్‌జిత్ సింగ్ నాకు తమ్ముడి లాంటివాడు-సీఎం పదవి దక్కలేదన్న బాధ లేదు-సుఖ్‌జిందర్ సింగ్ రియాక్షన్

|
Google Oneindia TeluguNews

పంజాబ్ కొత్త ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ సింగ్ చన్నీని ఖరారు చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత సుఖ్‌జిందర్ సింగ్ రందవా స్పందించారు.ఇది కాంగ్రెస్ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయమని... తాను స్వాగతిస్తున్నానని చెప్పారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కలేదన్న బాధ లేదని... కొత్త ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ తనకు తమ్ముడి లాంటివాడని పేర్కొన్నారు.

పంజాబ్ తాజా మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ కూడా చరణ్‌జిత్ సింగ్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు. సరిహద్దు రాష్ట్రం పంజాబ్‌ను సురక్షితంగా ఉంచడంలో,భద్రతా ముప్పు నుంచి ప్రజలకు తగిన రక్షణ కల్పించడంలో చరణ్‌జిత్ సమర్థవంతమైన చర్యలు చేపట్టగలరని ఆశిస్తున్నానన్నారు.

 charanjit singh channi is like my younger brother says sukhjinder singh

మొదట తెర పైకి సుఖ్‌జిందర్ సింగ్ పేరు:

పంజాబ్ తదుపరి ముఖ్యమంత్రిగా తొలుత సుఖ్‌జిందర్ సింగ్ పేరు ఖరారైనట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.ఆయన గవర్నర్ అపాయింట్‌మెంట్ కూడా కోరారని వార్తలు వచ్చాయి.కానీ ఇంతలోనే అనూహ్యంగా కాంగ్రెస్ చరణ్‌జిత్ సింగ్ చన్నీని కొత్త ముఖ్యమంత్రిగా ప్రకటించింది. చివరి నిమిషంలో దళిత సామాజికవర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చేసింది. కాంగ్రెస్ అధిష్ఠానం నిర్ణయంతో చరణ్‌జిత్ వర్గీయులు సంబరాల్లో మునిగిపోయారు. పంజాబ్‌లో దళితుల జనాభా దాదాపు 33శాతంగా ఉన్న నేపథ్యంలో... ఆ వర్గానికి చెందిన నేతను ముఖ్యమంత్రిని చేయడం 2022 అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కలిసొస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది.

తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే చర్చ జరుగుతున్న క్రమంలో పలువురి పేర్లు తెరపైకి రాగా.. అందులో చరణ్‌జిత్ పేరు ఎక్కడా వినిపించలేదు. సునీల్ కుమార్ జఖర్,ప్రతాప్ బజ్వా,సుఖ్‌జీందర్ రంద్వా,సుఖ్‌బీర్ సింగ్ సకారియా,త్రిప్త్ రజీందర్ సింగ్ బజ్వా,బ్రహ్మ్ మొహీంద్ర,విజయందర్ సింగ్లా,పంజాబ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కులజీత్ సింగ్,ఎంపీ ప్రతాప్ సింగ్ బజ్వా పేర్లు జాబితాలో ఉన్నట్లు ప్రచారం జరిగింది.

Recommended Video

Weather Update : మరో అల్పపీడనం ముప్పు.. AP & Telangana లో విస్తారంగా వర్షాలు..! || Oneindia Telugu

నిజానికి మొదట పార్టీ సీనియర్ నేత,రాజ్యసభ సభ్యురాలు అంబికా సోనికి కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అబింకా సోని ఆ ఆఫర్‌ను తిరస్కరించారు.అంతేకాదు, పంజాబ్ ముఖ్యమంత్రిగా సిక్కు వర్గానికి చెందిన నేతనే ఉండాలని అభిప్రాయపడ్డారు.ముఖ్యమంత్రి పదవికి సంబంధించి తన అంతరంగాన్ని తాను ఫాలో కావాల్సిందేనని పేర్కొన్నారు.

English summary
Senior Congress leader Sukhjinder Singh Randhawa responded after finalizing Charanjit Singh Channi as the new Chief Minister of Punjab. Sukhjinder said he did not disappoint at all for not getting the Chief Minister's post ... The new Chief Minister Charanjit Singh Channy is like a younger brother.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X