బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షాక్: బెంగళూరు విధాన సౌద కార్యదర్శి మీద లైంగిక వేధింపుల కేసు, సాటి ఉద్యోగులను !

సాటి ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేసిన సీనియర్ అధికారివిధాన సౌద కార్యదర్శి ఎస్. మూర్తి మీద కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులునిత్యం వేధింపులే, ఫిర్యాదు చేసిన బాధితులు, ఉలిక్కిపడిన సిద్దరామయ్య

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటకలో కొందరు మంత్రులు, అధికారులు కిందిస్థాయి ఉద్యోగులను వేధింపులకు గురి చేస్తున్నారని ఇప్పటికే ఆరోపణలు రావడంతో కేసులు నమోదై విచారణలో ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా విధాన సౌద వ్యవహారాలు పర్యవేక్షించే కార్యదర్శి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కర్ణాటక ప్రభుత్వం హడలిపోయింది.

సాటి ఉద్యోగులకు లైంగిక వైధింపులకు గురి చేస్తున్నారని విధాన సౌద కార్యదర్శి ఎస్. మూర్తి మీద పోలీసులు కేసు నమోదు చేశారు. శనివారం ఫిర్యాదు స్వీకరించిన విధాన సౌద పోలీసులు ఎస్. మూర్తి మీద ఐపీసీ 354, 509 సెక్షల కింద కేసు నమోదు చేసి విచారణ మొదలు పెట్టారు.

Charge of sexual harrasment Complaint against Vidhana Soudha security

విధాన సౌద కార్యదర్శి ఎస్. మూర్తి సాటి మహిళా ఉద్యోగులను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారని, నిత్యం వారిని అనేక విధాలుగా హింసలు పెడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. ప్రముఖ న్యాయవాది సుధా కట్వా, ఆర్ టీఐ కార్యకర్త శనివారం విధాన సౌద పోలీసులకు ఫిర్యాదు చెయ్యడంతో కేసు నమోదు అయ్యింది.

అయితే విధాన సౌద కార్యదర్తి ఎస్. మూర్తి లైంగిక వేధింపులకు గురి చేసిన మహిళా ఉద్యోగుల పేర్లు, వివరాలు రహస్యంగా పెట్టారు. విచారణ పూర్తి అయిన తరువాత బాధితుల వివరాలు తెలిసే అవకాశం ఉంది. విధాన సౌద కార్యదర్శి ఎస్. మూర్తి మీద లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో కర్ణాటకలోని సిద్దరామయ్య ప్రభుత్వం ఉలిక్కిపడింది. విధాన సౌద కార్యదర్శి ఎస్. మూర్తికి చెందిన పూర్తి సమాచారం సేకరించాలని ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఆదేశాలు జారీ చేశారని తెలిసింది.

English summary
Charge of sexual harrasment Complaint against vidhana soudha security S Murthy, Bengaluru in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X