వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో షాక్: ఎస్‌బీఐలో ఖాతా రద్దు చేసుకున్నా బాదుడే!

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో షాకిచ్చింది. ఆ బ్యాంకులో ఖాతాను వద్దనుకొనే వారి నుంచి రూ.575 ఛార్జీ వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

|
Google Oneindia TeluguNews

ముంబై: స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ) తన ఖాతాదారులకు మరో షాకిచ్చింది. ఆ బ్యాంకులో ఖాతాను వద్దనుకొనే వారి నుంచి రూ.575 ఛార్జీ వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు దిగ్భ్రాంతికి గురవుతున్నారు.

ఇప్పటికే ఎస్‌బీఐలో వినియోగదారుల కనిష్ఠ డిపాజిట్‌ను మహా నగరాల్లో రూ.5 వేలు, నగరాల్లో రూ.3 వేలు, చిన్న నగరాల్లో రూ.2 వేలు, గ్రామాల్లో రూ.1,000గా నిర్ణయించిన విషయం తెలిసిందే.

Charged Rs575 for closing an SBI account

అంతేగాక, ఖాతాల్లో డిపాజిట్‌ సక్రమంగా లేకపోతే దానికి తగ్గట్టుగా జరిమానా విధిస్తోంది. దీంతో ఎస్‌బీఐలో ఖాతాలు కలిగిన పలువురు తమ ఖాతాలను రద్దు చేసుకొనేందుకు బ్యాంకుకు వెళ్లగా అధికారులు రూ.575 ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

ఇదే విధంగా కరెంట్‌ అకౌంట్‌ రద్దు చేయదలచుకొనే వారికి రూ.1,000ల జరిమానాను వసూలు చేస్తుండడంతో ఖాతాదారులు ఖంగుతింటున్నారు. ప్రస్తుతం బ్యాంకుల తీరుతో వినియోగదారులు బ్యాంకుల్లో కొత్తగా ఖాతా తెరవాలంటేనే భయపడే పరిస్థితి దాపురించిందని పలువురు వాపోతున్నారు.

English summary
It is said that Charged Rs575/- for closing an SBI account.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X