వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రానైట్ స్కాం, తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనుమడి కేసులో 5 వేల పేజీల చార్జ్ షీట్ !

తమిళనాడులో మళ్లీ కక్షసాధింపు రాజకీయాలు మొదలైనాయి. అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంటే డీఎంకే పార్టీ నాయకుల మీద, డీఎంకే అధికారంలో ఉంటే అన్నాడీఎంకే నాయకుల మీద కేసులు నమోదు కావడం సర్వసాధారణం .

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో మళ్లీ కక్షసాధింపు రాజకీయాలు మొదలైనాయి. అన్నాడీఎంకే పార్టీ అధికారంలో ఉంటే డీఎంకే పార్టీ నాయకుల మీద, డీఎంకే అధికారంలో ఉంటే అన్నాడీఎంకే నాయకుల మీద కేసులు నమోదు కావడం సర్వసాధారణం అని అందరికీ తెలుసు.

జయలలిత అధికారంలో ఉన్న సమయంలో డీఎంకే పార్టీకి చెందిన కేంద్ర మాజీ మంత్రులతో పాటు ఎంతో అనుభవం, పేరు ప్రతిష్టలు ఉన్న నాయకుల పంచెలు ఊడదీసి మరీ అరెస్టులు చేసిన సందర్బాలు ఉన్నాయి. జయలలిత మరణించిన తరువాత అలాంటి రాజకీయాలకు దాదాపు తెరపడినట్లే అని అందరూ భావించారు.

Chargesheet filed against M karunandhi grandson Durai Dayanidhi

ఇప్పుడు తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి పెద్ద కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి అళగిరి కుటుంబ సభ్యుల మీద నమోదు అయిన కేసులో చార్జ్ షీటు దాఖలు చేశారు. గురువారం అళగిరి కుమారుడు దురై దయానిధి మీద నమోదు అయిన కేసులో ఐదు వేల పేజీలతో మదురై పోలీసులు చార్జ్ షీటు దాఖలు చేశారు.

మదురై జిల్లాలోని మేలూరు ప్రాంతంలో ప్రభుత్వానికి చెందిన భూముల్లో దురై దయానిధి అక్రమంగా గ్రానైట్ బయటకు తీసి వ్యాపారం చేశారని, అందువలన తమిళనాడు ప్రభుత్వానికి రూ. 257 కోట్లు నష్టం వచ్చిందని కోర్టులో చార్జ్ షీటు సమర్పించారు. కురుణానిధి మునుమడు దురై దయానిధి మీద నమోదు అయిన కేసులో మదురై పోలీసులు 5,191 పేజీల షార్జ్ షీటు కోర్టుకు సమర్పించడంతో డీఎంకే వర్గాలు హడలిపోయాయి.

English summary
The Madurai Police today filed the charge sheets against Former Union Minister MK Azhagiri's son Durai Dayanidhi in illegal granite quarrying case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X