వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇక సామాన్యులూ విమానాలు ఎక్కొచ్చు: ‘అదే అశోక్ గజపతికి ఆనందం’

హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమానంలో ప్రయాణించేలా చేస్తానని తాను అనాడు చెప్పానని.. ఇప్పుడు అదే చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర

|
Google Oneindia TeluguNews

సిమ్లా: హవాయి చెప్పులు వేసుకునే వారు కూడా విమానంలో ప్రయాణించేలా చేస్తానని తాను అనాడు చెప్పానని.. ఇప్పుడు అదే చేస్తున్నానని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. సామాన్య ప్రజలకు విమానయాన సేవలు అందించే లక్ష్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన ఉడాన్(ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్) పథకాన్ని గురువారం ప్రధాని మోడీ ప్రారంభించారు.

హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాలో సిమ్లా-ఢిల్లీ మార్గంలో నడిచే తొలి ప్రాంతీయ విమాన సేవలను మోడీ జెండా ఊపి ప్రారంభించారు. దీంతోపాటు కడప-హైదరాబాద్, నాందేడ్-హైదరాబాద్‌కు విమాన సేవలను కూడా ప్రారంభించారు. విమాన ప్రయాణాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే ఉడాన్ లక్ష్యమని ఈ సందర్భంగా మోడీ చెప్పారు.

విమానయానాన్ని తాను ఏ రూపంలో చూస్తాను అనేది తొలి సమావేశంలోనే చెప్పానని తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చాక దేశంలో తొలిసారి విమానయాన విధానాన్ని రూపొందించే అవకాశం తమ ప్రభుత్వానికి దక్కిందని చెప్పారు.

దేశంలో చిన్న మధ్య తరహా విమనాశ్రయాల అనుసంధానానికి కృషి చేస్తున్నట్లు మోడీ చెప్పారు. ట్యాక్సీల్లో ప్రయాణిస్తే కిలో మీటరుకు రూ. 10 ఖర్చు అవుతుందని, ఉడాన్ సర్వీసుల్లో కిలో మీటరుకు రూ.6నుంచి 7 వరకు మాత్రమే ఉంటుందని మోడీ తెలిపారు.
ఉడాన్ సర్వీస్‌లో గంటలోపు ప్రయాణానికి రూ. 2,500 ఖర్చవుతుందని వివరించారు.

అశోక్ గజపతి రాజుకు ఆనందం

వేగంగా అభివృద్ధి చెందుతున్న ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విమాన సేవలు అందిస్తే మరింత మేలు కలుగుతుందని అన్నారు. పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు, అందుకే ఉడాన్ పథకంలో కడప ఉండటం ఆయనకు ఆనందం కలిగించే విషయమని మోడీ అన్నారు.

కాగా, కడప-హైదరాబాద్ ట్రూజెట్ విమాన సర్వీసులు గురువారం ప్రారంభమవడంతో ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి ఆ విమానంలో ప్రయాణించారు.

English summary
Prime Minister Narendra Modi on Thursday inaugurated the first UDAN flight under the Regional Connectivity Scheme. The Prime minister waived as the first flight under the scheme took off on Shimla-Delhi sector.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X