వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Cheating: విదేశాల్లో ఉద్యోగం అని ఉంగరాలు పంపించాడు, లేడీకి రూ. 15 లక్షలు !

|
Google Oneindia TeluguNews

ముంబాయి/థానే: యువతి ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తోంది. మంచి ఉద్యోగం చేస్తున్న యువతి బాగానే వేలల్లో జీతం తీసుకుంటున్నది. ఇదే సమయంలో ఓ యువకుడు సోషల్ మీడియాలో ఆమెకు పరిచయం అయ్యాడు. తాను విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నానని ఆమెకు దగ్గర అయ్యాడు. మొదట తక్కువ గ్రాములు ఉన్న బంగారు నగలు ఆమెకు పంపించి ఆమె దగ్గర నమ్మకం సంపాధించాడు. తాను భారీ మొత్తంలో బంగారు నగలు పంపిస్తున్నానని, కస్టమ్స్ ట్యాక్స్ కట్టడానికి డబ్బులు అవసరం అవుతుందని అతను లేడీ ల్యాబ్ టెక్నీషియన్ కు చెప్పాడు. సోషల్ మీడియా ఫ్రెండ్ చెప్పిన అకౌంట్ కు ఆమె రూ. 15 లక్షలు పంపించింది. అంతే అక్కడ సార్ అసలు కథ మొదలు పెట్టాడు.

Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !Illegal affair: ఆంటీ మీద అంకుల్ కు అనుమానం, ఆవేశంతో గొడ్డలితో నరికి చంపేసి !

 ముంబాయిలో ల్యాబ్ టెక్నీషియన్

ముంబాయిలో ల్యాబ్ టెక్నీషియన్

ముంబాయిలో నివాసం ఉంటున్న 24 ఏళ్ల యువతి ముంబాయిలోని ఓ ప్రముఖ లేబొరేటరీలో ల్యాబ్ టెక్నీషియన్ గా ఉద్యోగం చేస్తోంది. మంచి ఉద్యోగం చేస్తున్న యువతి బాగానే వేలల్లో జీతం తీసుకుంటున్నది. ల్యాబ్ టెక్నీషియన్ ఖాళీ సమయంలో మొబైల్ ఫోన్ లో కాలం గడుపుతూ సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉంటున్నది.

 సిరియాలో ఉద్యోగం చేస్తున్నాను

సిరియాలో ఉద్యోగం చేస్తున్నాను

ఓ యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో లేడీ ల్యాబ్ టెక్నీషియన్ ను పరిచయం చేసుకున్నాడు. తాను సిరియాలోని ఆర్మీ క్యాంపులో ఉద్యోగం చేస్తున్నానని, తనది ముంబాయి అని ఆమెకు దగ్గర అయ్యాడు. కొంతకాలం ఇద్దరూ సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారు. కొంతకాలం తరువాత మొదట తక్కువ గ్రాములు ఉన్న బంగారు నగలు లేడీ ల్యాబ్ టెక్నీషియన్ కు పంపించిన కేటుగాడు ఆమె దగ్గర నమ్మకం సంపాధించాడు.

 రూ. 15 లక్షలు స్వాహా

రూ. 15 లక్షలు స్వాహా

తాను భారీ మొత్తంలో బంగారు నగలు పంపిస్తున్నానని, కస్టమ్స్ ట్యాక్స్ కట్టడానికి డబ్బులు అవసరం అవుతుందని, ఆ డబ్బు నువ్వు ఇస్తే బంగారు నగలు మీ ఇంటికే వస్తాయని అతను లేడీ ల్యాబ్ టెక్నీషియన్ కు చెప్పాడు. సోషల్ మీడియా ఫ్రెండ్ చెప్పిన అకౌంట్ కు లేడీ ల్యాబ్ టెక్నీషియన్ రూ. 15 లక్షలకు పైగా డబ్బులు పంపించింది.

 పక్కా 420 అని తెలుసుకుని ?

పక్కా 420 అని తెలుసుకుని ?

రూ. 15 లక్షలు పంపించిన తరువాత ఆ కేటుగాడు మరో రూ. 10 లక్షలు కావాలని చెప్పాడు, మరో రూ. 10 లక్షలు ఇస్తే వెంటనే బంగారు నగలు వస్తాయని చెప్పాడు. ఇప్పటికే రూ. 15 లక్షలు ఇచ్చానని, నా దగ్గర డబ్బులు లేవని ఆమె చెప్పింది, డబ్బులు లేవని చెప్పిన తరువాత అతను ఆమెతో చాటింగ్ చెయ్యడం మానేశాడు. తాను మోసపోయానని గుర్తించిన లేడీ ల్యాబ్ టెక్నీషియన్ ముంబాయి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు కేటుగాడి కోసం గాలిస్తున్నారు.

English summary
Cheating: A young woman lost Rs15 lakh rupees to cyber man in Mumbai city.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X