బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బీజేపీ ఎమ్మెల్యే ప్రేమకథాచిత్రమ్, పెళ్లి పేరుతో శారీరకంగా, ప్రేమకుమారి కేసు ఏంది ?!

|
Google Oneindia TeluguNews

మైసూరు/బెంగళూరు: ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి శారీరకంగా తనను లొంగదీసుకుని తనను మోసం చేశారని ప్రేమకుమారి అనే మహిళ ఫిర్యాదు చేసిన కేసులో మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ కు చిక్కులు ఎదురైనాయి. ఈ కేసు విచారణ చేస్తున్నామని, క్రిమినల్ కేసు నమోదు కావడంతో విచారణకు కచ్చితంగా హాజరుకావాలని న్యాయస్థానం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ కు సమన్లు జారీ చేసింది. ప్రత్యేక కోర్టు ఆదేశాలతో బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ విచారణ ఎదుర్కోవడానికి సిద్దం అయ్యారు.

చిన్నమ్మ శశికళకు షాక్, 2021లో విడుదల, బాంబు పేల్చిన డీజీపీ, సత్ర్పవర్తనా, తొక్క!చిన్నమ్మ శశికళకు షాక్, 2021లో విడుదల, బాంబు పేల్చిన డీజీపీ, సత్ర్పవర్తనా, తొక్క!

ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా జల్సా !

ప్రేమ, పెళ్లి పేరుతో శారీరకంగా జల్సా !

నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుని భార్యగా అందరిలో గుర్తింపు ఇస్తానని నమ్మించి మోసం చేశారని, శారీరక సంబంధం పెట్టుకుని జల్సా చేసి ఇప్పుడు పెళ్లి చేసుకోనని మోసం చేశారని మైసూరులోని కృష్ణరాజ నియోజక వర్గం బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ మీద ప్రేమకుమారి అనే మహిళ సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి చేసుకోమని చెప్పిన తనను చంపేస్తానని శ్రీకాంతదాస్ అనే వ్యక్తితో బెదిరించారని ప్రేమకుమారి మైసూరు నగరంలోని సరస్వతిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

బ్లాక్ మెయిల్ చేశారు

బ్లాక్ మెయిల్ చేశారు

2014 ఫిబ్రవరి 14వ తేదీ (ప్రేమికుల రోజు) ప్రేమకుమారి అనే మహిళ మైసూరులోని సరస్వతిపురం పోలీసులకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ మీద కేసు పెట్టారు. బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాస్ మీద కఠిన చర్యలు తీసుని తనకు న్యాయం చెయ్యాలని ప్రేమకుమారి ఆందోళనకు దిగారు. ఆ సమయంలో ప్రేమకుమారికి అనేక మహిళా సంఘాలు మద్దతు ఇచ్చాయి.

మంత్రి హోదా దుర్వినియోగం

మంత్రి హోదా దుర్వినియోగం

ప్రేమకుమారి తన మీద లేనిపోని ఆరోపణలు చేసి నగదు లాక్కోవడానికి బ్లాక్ మెయిల్ చేస్తోందని, ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో బీజేపీ మంత్రిగా ఉన్న ఎస్ఎ. రామదాస్ ఆరోపించారు. తన మంత్రి పదవిని అడ్డం పెట్టుకుని ప్రేమకుమారి, ఆమె బంధువులు దందాలు చేసి అవినీతికి పాల్పడ్డారని ఎస్ఎ. రామదాస్ ఆరోపించారు.

సీఐడీ విచారణ, బి రిపోర్టు

సీఐడీ విచారణ, బి రిపోర్టు

ప్రేమకుమారి ఆరోపణలు చేసి కేసు పెట్టిన సమయంలో ఎస్ఎ. రామదాస్ మంత్రిగా ఉన్నారు. మంత్రి హోదాలో ఉన్న ఎస్ఎ. రామదాస్ కేసు విచారణ తప్పుదోవ పడుతుందని ఆరోపణలు రావడంతో ప్రభుత్వం కేసు సీఐడీకి అప్పగించింది. కేసు విచారణ సీఐడీ చేతికి వెళ్లింది. కేసు విచారణ చేసిన సీఐడీ అధికారులు ఎస్ఎ. రామదాస్ కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్షాలు లేవని బి రిపోర్టు తయారు చేసి న్యాయస్థానంలో సమర్పించారు. అయితే సీఐడీ అధికారులు సమర్పించిన బి రిపోర్టు రద్దు చెయ్యాలని ప్రేమకుమారి ఆందోళనకు దిగారు. తనకు న్యాయం చెయ్యాలని ప్రేమకుమారి ప్రత్యేక న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

విచారణ చేస్తాం

విచారణ చేస్తాం

ఎమ్మెల్యేలు, ఎంపీల మీద వచ్చిన ఆరోపణలు విచారణ చేసే ప్రత్యేక న్యాయస్థానం ముందు ఎస్ఎ. రామదాసు, ప్రేమకుమారిల కేసు విచారణకు వచ్చింది. ఆరోపణలు చేస్తున్న అర్జీదారు చేసిన ఆరోపణలు పరిశీలిస్తే ఈ కేసు విచారణ చెయ్యడానికి అర్హత ఉందని, కచ్చితంగా కేసు విచారణ చేస్తామని ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి రామచంద్ర డి. హుద్దార స్పష్టం చేశారు. కేసు విచారణకు నవంబర్ 11వ తేదిన కోర్టు ముందు హాజరుకావాలని న్యాయమూర్తి బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాసుకు సమన్లు జారీ చేశారు.

ఏం దర్యాప్తు చేశారు ?

ఏం దర్యాప్తు చేశారు ?

బీజేపీ ఎమ్మెల్యే ఎస్ఎ. రామదాసు, ప్రేమకుమారిల కేసును పోలీసు అధికారులు సక్రమంగా విచారణ చెయ్యలేదని న్యాయస్థానం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ కేసు ఐపీఎస్ సెక్షన్ ప్రకారం ఆరోపణలు పరిశీలించి క్రిమినల్ కేసు నమోదు చేస్తున్నామని, కేసు విచారణ జరుగుతుందని ప్రత్యేక న్యాయస్థానం చెప్పింది.

English summary
Mysuru: Elected representatives special court issued summons to Karnataka former minister and BJP MLA S.A.Ramadas in cheating and sexual harassment case. Prema Kumari field the complaint against S.A.Ramadas.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X