వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పై చీటింగ్ కేసు ...ఆ ఐడియా కాపీ చేశారట!!

|
Google Oneindia TeluguNews

రాజకీయ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ కు ఈ మధ్య బాగా డిమాండ్ పెరిగింది. చాలా రాజకీయ పార్టీలు పీకే వ్యూహాల కోసం పోటీ పడుతున్నాయి. తమ రాజకీయ వ్యూహకర్తగా నియమించుకోవాలని తెగ తాపత్రయపడుతున్నాయి. ఢిల్లీ ఎన్నికల ఫలితాలతో ఆయన క్రేజ్ మరింత పెరిగింది. ఇక ఇప్పుడు తాజాగా పీకే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి తన సలహాలు సూచనలు అందిస్తూ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో ఆయనపై చీటింగ్ కేసు నమోదు అయ్యింది.

మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు 'జడ్‌ కేటగిరీ’ భద్రత .. !!మమతా బెనర్జీ నిర్ణయం: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌కు 'జడ్‌ కేటగిరీ’ భద్రత .. !!

తన ఆలోచనలు కాపీ చేసి బాత్ బీహార్ కీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు

తన ఆలోచనలు కాపీ చేసి బాత్ బీహార్ కీ నిర్వహిస్తున్నారని ఫిర్యాదు


ప్రశాంత్ కిషోర్ కు పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం జడ్‌ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయం తీసుకుని ఆయనకు చాలా ప్రాధాన్యతను ఇస్తుంది . ఇక ఇదే సమయంలో ప్రశాంత్ కిశోర్ పై చీటింగ్ కేసు నమోదైంది. తన ఆలోచనలు కాపీ చేసి బాత్ బీహార్ కీ అనే కార్యక్రమాన్ని తయారు చేశారని మోతీహారి కి చెందిన గౌతమ్ అనే యువకుడు తన ఆలోచనలు కాపీ కొట్టి వాటిని వాడుకుంటున్నారని ప్రశాంత్ కిషోర్ పై పోలీస్ కేసు పెట్టారు.

 ప్రశాంత్ కిషోర్, ఒసామాలపై కేసులు ఫైల్ చేసిన పోలీసులు

ప్రశాంత్ కిషోర్, ఒసామాలపై కేసులు ఫైల్ చేసిన పోలీసులు

తాను జనవరిలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెడితే, ప్రశాంత్ కిషోర్ ఫిబ్రవరిలో బాత్ బీహార్ కి కార్యక్రమాన్ని మొదలుపెట్టారని, దానికి సంబంధించిన సాక్ష్యాధారాలను పోలీసులకు అందజేశారు గౌతమ్. దీంతో పోలీసులు ప్రశాంత్ కిషోర్, ఒసామాలపై కేసులు ఫైల్ చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక దేశంలో రాజకీయ వర్గాల్లో బాగా డిమాండ్ ఉన్న ప్రశాంత్ కిషోర్ పై చీటింగ్ కేసు నమోదు కావటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

 చీటింగ్ కేసు పెట్టటంపై పీకే స్పందన ఏమిటో ?

చీటింగ్ కేసు పెట్టటంపై పీకే స్పందన ఏమిటో ?

ఇక ప్రశాంత్ కిషోర్ కొంతకాలంగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ వస్తున్నారు. కేంద్రం తీసుకొచ్చిన చాలా చట్టాలకు వ్యతిరేకంగా పీకే మాట్లాడుతున్నారు. ఇక తాజాగా సీఏఏ ను తీవ్ర స్థాయిలో వ్యతిరేకించారు ప్రశాంత్ కిషోర్ . ఇక ఈ నేపధ్యంలోనే బీహార్ లోని నితీష్ నేతృత్వంలోని జేడీ యూ లో ఉపాధ్యక్షుడిగా ఉన్న ప్రశాంత్ కిషోర్ పై వేటు వేశారు. ప్రశాంత్ కిషోర్ ను జెడియూ ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించారు. అయినప్పటికీ పీకే తన స్టైల్ మార్చుకోలేదు. ఇక తాజాగా ఆయనపై చేటింగ్ కేసు నమోదు చెయ్యటంపై పీకే స్పందన ఏమిటో తెలియాల్సి ఉంది.

English summary
A cheating case has been registered against Prashant Kishore. Prashant Kishore is suing for allegedly copying his ideas and making a program called Baat Bihar Ki. Gautam said that Prashant Kishore had started the program in Bath Bihar in February and the program started by him in january . He had given evidence to the police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X