Cheating: లవ్ మ్యారేజ్, పెళ్లికి ముందే అబార్షన్, కేటుగాడు ఏం స్కెచ్ వేశాడంటే ?, లక్షల్లో డబ్బు, నగలు !
బెంగళూరు/చామరాజనగర్: తల్లితో కలిసి నివాసం ఉంటున్న యువతి ఓ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. ఉద్యోగం చేస్తున్న యువతి ఆమె తల్లితో కలిసి సంతోషంగా జీవించేది. యువతి సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది. ఓ రోడ్డు ప్రమాదంలో యువతి తల్లి చనిపోయింది. ప్రమాదంలో చనిపోయిన తల్లికి లక్షలాది రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది. తల్లి సొంత ఊరుకు నెలనెల వచ్చి వెలుతున్న యువతి ఆమె ముందు పని చేస్తున్న కంపెనీలోనే ఉద్యోగం చేస్తూనే ఉంది. ఇదే సమయంలో అమ్మమ్మ ఊరిలో ఉన్న యువకుడు సోషల్ మీడియాలో యువతికి పరిచయం అయ్యాడు. ఐ లవ్ యూ అంటూ ఆ యువతిని లైన్ లో పెట్టాడు. యువతిని శారీరకంగా లొంగదీసుకున్న అతను ఆమెను గర్బవతిని చేశాడు. యువతికి అబార్షన్ చేయించిన యువకుడు కొన్ని నెలల తరువాత ఆమెను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత కేవలం 10 రోజులు మాత్రమే భార్యతో కాపురం చేసిన కేటుగాడు ఆమె దగ్గర ఉన్న లక్షల రూపాయల డబ్బులు, బంగారు నగలు లూటీ చేసి ఎస్కేప్ అయ్యాడు. డబ్బు, నగలు పోతేపోయాయని, నాకు నా భర్తను వెతికిపెట్టి ఇవ్వండి అంటూ లవ్ మ్యారేజ్ చేసుకున్న భార్య పోలీసులను వేడుకుంటున్నది.
Shock: అక్కా అంటూ వెంట తిరిగాడు, 17 ఏళ్ల అమ్మాయిని తల్లిని చేసిన 12 ఏళ్ల అబ్బాయి, షాక్ లో ఫ్యామిలీ !

తల్లితో కలిసి హ్యాపీగా ఉండేది
తమిళనాడులోని తిరుప్పూర్ లో రాణిబాయ్ అనే మహిళ నివాసం ఉంటున్నది. రాణిబాయ్ కి నందితా బాయ్ అనే కుమార్తె ఉన్నది. డిగ్రీ వరకు చదువుతున్న నదియా బాయ్ తిరుప్పూర్ లోని బినియన్ కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఉద్యోగం చేస్తున్న నదియా బాయ్ ఆమె తల్లి రాణి బాయ్ తో కలిసి సంతోషంగా జీవించేది. నదియా బాయ్ ఖాలీ సమయంలో సోషల్ మీడియాలో కాలం గడుపుతోంది.

తల్లి చనిపోతే లక్షల్లో డబ్బులు వచ్చింది
2021లో తిరుప్పూర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నదియా బాయ్ తల్లి రాణి బాయ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తల్లి రాణి బాయ్ కి రూ. 12 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చింది. తల్లి రాణి బాయ్ డబ్బు ఆమె కూతురు నదియా బాయ్ కి వచ్చింది. తల్లి చనిపోయిన బాధలోనే నదియా బాయ్ ఉద్యోగం చేస్తోంది.

అమ్మమ్మ ఊరికి వచ్చి వెలుతున్న నదియా
రాణి బాయ్ సొంత ఊరు కర్ణాటకలోని చామరాజనగర్ సమీపంలోని మూకనపాళ్య. తల్లి రాణి బాయ్ చనిపోయిన తరువాత నదియా బాయ్ అమ్మమ్మ ఊరు అయిన చామరాజనగర సమీపంలోని మూకనానపాళ్యకు ప్రతినెల వచ్చి వెలుతూ తిరుప్పూర్ లోనే బినియన్ కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ జీవనం సాగించింది.

నదియాను లైన్ లో పెట్టిన చలపతి
అమ్మమ్మ సొంత ఊరుకు నెలనెల వచ్చి వెలుతున్న నదియా బాయ్ బందువులతో కలిసిమెలసి ఉంటూ తిరుప్పూర్ లోని కంపెనీలోనే ఉద్యోగం చేస్తూ డబ్బు సంపాధించుకుంటున్నది. ఇదే సమయంలో అమ్మమ్మ ఊరిలో నివాసం ఉంటున్న చలపతి అనే యువకుడు ఇన్ స్టాగ్రామ్ లో నదియా బాయ్ కి పరిచయం అయ్యాడు.

ఐలవ్ యూ అంటూ రంగంలోకి దింపాడు
నదియా బాయ్ దగ్గర లక్షలాది రూపాయల డబ్బు, నగలు ఉన్నాయని చలపతికి తెలిసిపోయింది. కొంతకాలం నదియా బాయ్ తో మంచితనంతో ఉన్న చలపతి తరువాత ఐ లవ్ యూ అంటూ నదియా బాయ్ ని లైన్ లో పెట్టాడు. కొంతకాలనికే నదియా బాయ్ ని శారీరకంగా లొంగదీసుకున్న చలపతి ఆమెతో ఎంజాయ్ చేసి ఆమెను గర్బవతిని చేశాడు.

అబార్షన్ చేసిన తరువాత పెళ్లి
నదియా బాయ్ కి అబార్షన్ చేయించిన చలపతి కొన్ని నెలల తరువాత ఆమెను గుడిలో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న తరువాత కేవలం 10 రోజులు మాత్రమే భార్య నదియా బాయ్ తో కాపురం చేశాడు. ఆ పది రోజుల్లోనే భార్య నదియా బాయ్ మీద లేనిపోని నిందలు వేశాడు. పెళ్లికి ముందు నా కారణంగా నదియా బాయ్ కి అబార్షన్ కాలేదని ఆరోపించాడు. ఆమె ఎవరితోనో ఎక్కువగా ఫోన్ మాట్లాడుతోందని, నాకంటే ముందే ప్రియుడు ఉన్నాడని నిందలు వేసి ఆమెను బంధువుల ముందు చులకనగా మాట్లాడాడు.

నగలు, రూ. 5 లక్షలతో ఎస్కేప్
అప్పటికే నదియా దగ్గర ఉన్న రూ. 5 లక్షల డబ్బు, ఆమె బంగారు నగలు ఇప్పించుకున్న కేటుగాడు చలపతి ఎస్కేప్ కావాలని స్కెచ్ వేశాడు. భార్య నదియా బాయ్ దగ్గర ఉన్న లక్షల రూపాయల డబ్బులు, బంగారు నగలు లూటీ చేసిన చలపతి రాత్రికి రాత్రే మాయం అయ్యాడు. డబ్బు, నగలు పోతేపోయాయని, నాకు నా భర్త చలపతిని వెతికిపెట్టి ఇవ్వండి అంటూ లవ్ మ్యారేజ్ చేసుకుని మోసపోయిన అతని భార్య నదియా బాయ్ చామరాజనగర మహిళా పోలీసులను వేడుకుంటున్నది. నదియా బాయ్ మేనమామ బాలాజీ నాయక్ చలపతి మీద కేసు పెట్టాడని, మోసగాడి కోసం గాలిస్తున్నామని చామరాజనగర మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు.