Cheating: నిలువునా ముంచేసిన ప్రాణస్నేహితుడు, నమ్మితే ?, వాట్సాప్ లో డెత్ నోటా షేర్ చేసి !
బెంగళూరు/ కడప: సొంత రాష్ట్రంలో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్న యువకుడు పక్క రాష్ట్రానికి వలస వెళ్లి వ్యవసాయం చేసుకుంటూ సంతోషంగా ఉండాలని కలలు కన్నాడు. పక్క రాష్ట్రంలో ఏకంగా 22 ఎకరాల భూమి లీజ్ కు తీసుకున్న అతను వ్యవసాయం చేయిస్తూ డబ్బులు సంపాధిస్తూ అతని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాడు. లీజ్ కు తీసుకున్న పొలంలో నీరు పుష్కలంగా ఉండటంతో వరి పంట వేశాడు. ఈ సారి 22 ఎకరాల్లో పంట బాగా రావడంతో ఇక కొన్ని సంవత్సరాలు తనకు కష్టాలు ఉండవని కలలు కన్నాడు. అయితే ఓ స్నేహితుడిని విపరీతంగా నమ్మిన ఆ యువకుడు నిలువునా మునిగిపోతానని కలలొ కూడా ఊహించలేకపోయాడు. వరిపంటను వ్యవసాయం చేయిస్తున్న యువకుడు అతని స్నేహితుడి ద్వారా ఓ సేఠ్ కు విక్రయించి వచ్చిన రూ. 9 లక్షలు అతని అకౌంట్ లో వేసుకున్నాడు. స్నేహితుడు కొన్ని లక్షల రూపాయలు ఒక్కసారి మోసం చెయ్యడంతో తట్టుకోలేకపోయిన యువకుడు తన ఆత్మహత్యకు తన స్నేహితుడే కారణం అని డెత్ నోట్ రాసి వాట్సాప్ లో బంధువులు అందరికి పంపించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Illegal affair: క్యాబిన్ లో మేనేజర్ తో కాపురం పెట్టిన భార్య, బయట భర్త చూసి ?, ఏక్ మార్ !

పక్కా రాష్ట్రానికి వలస వెళ్లిన యువకుడు
ఆంధ్రప్రదేశ్ కు చెందిన రామ్ మోహన్ అనే యువకుడు ఆ రాష్ట్రంలో వ్యవసాయం చేసి ఆర్థికంగా చితికిపోయాడని తెలిసింది. ఇక లాభం లేదని అనుకున్న రామ్ మోహన్ కర్ణాటకలోని యాదగిరి జిల్లాలోని హడగిముద్రా గ్రామం చేరుకుని 22 ఎకరాల వ్యవసాయ పోలం లీజ్ కు తీసుకుని అక్కడే వ్యవసాయం చేయిస్తున్నాడు.

వరి పంట వేసిన యువకుడు
కర్ణాటకలో ఏకంగా 22 ఎకరాల భూమి లీజ్ కు తీసుకున్న రామ్ మోహన్ వ్యవసాయం చేయిస్తూ ఇంతకాలం డబ్బులు బాగా సంపాధిస్తూ అతని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటున్నాడు. లీజ్ కు తీసుకున్న పొలంలో నీరు పుష్కలంగా ఉండటంతో ఇటీవల రామ్ మోహన్ లక్షల రూపాయలు ఖర్చు చేసి వరి పంట వేశాడు.

స్నేహితుడి మీద విపరీతమైన నమ్మకం
రామ్ మోహన్ కు రమేష్ అనే స్నేహితుడు ఉన్నాడు. స్నేహితుడు రమేష్ కష్టసుఖాల్లో రామ్ మోహన్ చేదోడువాదోడుగా ఉంటున్నారు. రమేష్ కు ఆర్థికంగా, కుటుంబ సమస్యల పరంగా ఎలాంటి సమస్య వచ్చినా రామ్ మోహన్ దగ్గర ఉండి పరిష్కరిస్తూ వస్తున్నాడు. రామ్ మోహన్ ఆర్థిక వ్యవహారాలు ఎక్కువగా రమేష్ చూసుకుంటూ వస్తున్నాడు.

చేతులు ఎత్తేసిన ఫ్రెండ్
ఈ సారి 22 ఎకరాల్లో వరి పంట బాగా రావడంతో ఇక కొన్ని సంవత్సరాలు తనకు కష్టాలు ఉండవని రామ్ మోహన్ కలలు కన్నాడు. అయితే తన స్నేహితుడు రమేష్ ను విపరీతంగా నమ్మిన రామ్ మోహన్ అతని వలన తాను నిలువునా మునిగిపోతానని కలలొ కూడా ఊహించలేకపోయాడు. వరిపంటను వ్యవసాయం చేయిస్తున్న రామ్ మోహన్ అతని స్నేహితుడు రమేష్ ద్వారా లాల్ సేఠ్ కు విక్రయించాడు. లాల్ సేఠ్ దగ్గర రూ. 9 లక్షలు తీసుకున్న రమేష్ అతని అకౌంట్ లో వేసుకుని రైతు రామ్ మోహన్ కు పంగనామాలు పెట్టాడు.

డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ఇదే విషయంలో రామ్ మోహన్, రమేష్ ల మద్య వాగ్వివాదం జరిగింది. తరువాత రమేష్ రూ. 3 లక్షలు మాత్రమే రామ్ మోహన్ కు ఇచ్చిన రమేష్ తరువాత చేతులు ఎత్తేశాడని తెలిసింది. ప్రాణ స్నేహితుడు స్నేహితుడు రమేష్ రూ. 4. 50 లక్షల రూపాయలు ఒక్కసారిగా మోసం చెయ్యడంతో తట్టుకోలేకపోయిన రామ్ మోహన్ తన ఆత్మహత్యకు తన స్నేహితుడు రమేష్ కారణం అని డెత్ నోట్ రాసి వాట్సాప్ లో బంధువులు అందరికి పంపించి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.