వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోసం..దగా..కుట్ర: కాంగ్రెస్ వెన్నుపోటు: బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆక్రోశం

|
Google Oneindia TeluguNews

లక్నో: రాజస్థాన్ అసెంబ్లీకి ఎన్నికైన ఆరుమంది బహుజన్ సమాజ్ వాది పార్టీ (బీఎస్పీ) శాసన సభ్యులు మూకుమ్మడిగా కాంగ్రెస్ లో చేరడంపై ఆ పార్టీ అధినేత్రి, ఉత్తర్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఒక పార్టీ గుర్తు నుంచి గెలిచి, రాజీనామా చేయకుండా మరో పార్టీలో చేరడం రాజ్యాంగ విరుద్ధమని ఆక్రోశించారు. ఆరుమంది ఎమ్మెల్యేలు తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తోన్న కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిందని ఆమె ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం వరుసగా ట్వీట్లను సంధించారు.

చంద్రయాన్-2 గురించి ఆరా తీసిన హాలీవుడ్ సూపర్ స్టార్: దురదృష్టకరమంటూ కామెంట్చంద్రయాన్-2 గురించి ఆరా తీసిన హాలీవుడ్ సూపర్ స్టార్: దురదృష్టకరమంటూ కామెంట్

గత ఏడాది రాజస్థాన్ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీఎస్పీ తరఫున ఆరుమంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. రాజేంద్రగుడ, జోగేంద్ర సింగ్ అవానా, వజీబ్ అలీ, లఖన్ సింగ్ మీనా, సందీప్ యాదవ్, దీప్ చంద్ ఖేరియా సోమవారం రాత్రి మూకుమ్మడిగా బీఎస్పీకి రాజీనామా చేశారు. రాజస్థాన్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారి చేరికతో అసెంబ్లీలో 101 మంది సభ్యులు ఉన్న కాంగ్రెస్ పార్టీ బలం 107కు చేరింది. తమ పార్టీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించడాన్ని మాయావతి తప్పు పట్టారు. స్నేహంగా ఉన్నట్లు నటించిన కాంగ్రెస్ పార్టీ తనను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు.

 Cheats: Mayawati Fumes At Congress As All 6 Rajasthan MLAs Switch Sides

నమ్మిన వారిని మోసగించడం కాంగ్రెస్ పార్టీకి అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా బయటి నుంచి మద్దతు ఇస్తున్నామని, అయినప్పటికీ.. దాన్ని పట్టించుకోకుండా మిత్ర ద్రోహానికి పాల్పడిందని మాయావతి నిప్పులు చెరిగారు. బడుగులు, దళితుల కోసం కృషి చేస్తోన్న తమ పార్టీ సిద్ధాంతాలకు కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచిందని మండి పడ్డారు. తన రాజకీయ ప్రత్యర్థులపై పోరాడాల్సిన కాంగ్రెస్ పార్టీ దానికి భిన్నంగా ప్రవర్తించిందని, నమ్మిన వారిని మరోసారి వంచించిందని విమర్శించారు.

దళితులు, గిరజనులు, వెనుకబడిన వర్గాల ప్రజలను మోసం చేసిందని అన్నారు. రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సిద్ధాంతాలకు తాను దూరమనే విషయాన్ని కాంగ్రెస్ మరోసారి రుజువు చేసుకుందని మాయావతి ధ్వజమెత్తారు.

English summary
The BSP's Rajendra Guda, Jogendra Singh Awana, Wajib Ali, Lakhan Singh Meena, Sandeep Yadav and Deepchand Kheria have joined the Congress, taking its tally to 106 in the 200-member assembly, past the majority mark of 101. The move is significant just two months ahead of local body elections due in November. "The Congress has always been against BR Ambedkar and his ideology. That is why Ambedkar had to resign as the country's first law minister. The Congress never honoured him with a Bharatratna, which is sad and shameful," tweeted Mayawati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X