వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనాకు చీరలతో చెక్ .. ఆయుర్ వస్త్ర ఇమ్యూనిటీ బూస్టర్ చీరలట !!..కోవిడ్ టైమ్ బిజినెస్ ప్లాన్ అదుర్స్

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుకోవడంపై ప్రతి ఒక్కరు దృష్టిసారిస్తున్నారు.దీంతో ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని మార్కెట్లోకి రకరకాల ఇమ్యూనిటీ బూస్టర్లు వచ్చిపడుతున్నాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించే పానీయాలు, టాబ్లెట్లు,అప్పడాలు వంటి స్నాక్స్ మాత్రమే కాకుండా తాజాగా రోగనిరోధక శక్తిని పెంచే చీరలు కూడా మార్కెట్లోకి వచ్చి పడ్డాయి అంటే మన వాళ్ళ కరోనా భయం ఎంత పీక్స్ కి వెళ్లిందో అర్థం చేసుకోవచ్చు.

రోగనిరోధక శక్తిని పెంచే చీరలను తయారుచేసిన మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్ కార్పొరేషన్

రోగనిరోధక శక్తిని పెంచే చీరలను తయారుచేసిన మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్ కార్పొరేషన్

'ఆయుర్ వస్త్ర' పేరుతో రోగనిరోధక శక్తిని పెంచే చీరలను మధ్యప్రదేశ్ రాష్ట్రంలో మధ్యప్రదేశ్ హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీ క్రాఫ్ట్ కార్పొరేషన్ మార్కెట్లోకి తీసుకు వచ్చింది. రోగనిరోధక శక్తిని పెంచే కషాయాలు తాగుతూ కరోనా బారిన పడకుండా కాపాడుకుంటున్న వారు,కరోనా సోకకుండా ఉండేందుకు ఇమ్యూనిటీ బూస్టర్ చీరలను కొనుగోలు చేయొచ్చని, రకరకాల సుగంధద్రవ్యాలతో వీటిని తయారు చేశామని హ్యాండ్లూమ్ అండ్ హ్యాండీక్రాఫ్ట్ కార్పొరేషన్ అధికారులు చెప్తున్నారు.

మూడువేలకు పైగా ధర ... త్వరలో దేశ వ్యాప్తంగా ఇమ్యూనిటీ బూస్టర్ చీరలు

మూడువేలకు పైగా ధర ... త్వరలో దేశ వ్యాప్తంగా ఇమ్యూనిటీ బూస్టర్ చీరలు

మధ్యప్రదేశ్ చేనేత మరియు హస్తకళల కార్పొరేషన్ ఈ చీరల ధరలను మూడు వేల రూపాయలకు పైగా నిర్ణయించి అమ్మకాలు చేపట్టింది. ప్రస్తుతం వీటిని భోపాల్ మరియు ఇండోర్ లో విక్రయిస్తున్నప్పటికీ త్వరలో దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తామని వారు పేర్కొంటున్నారు. రోగనిరోధక శక్తిని పెంచే ఉద్దేశంతో చీరలను తయారుచేసిన భోపాల్ కు చెందిన ఓ వస్త్ర నిపుణుడు వినోద్ మాలేవర్ శతాబ్దాల నాటి పద్ధతిని ఉపయోగించి ఈ చీరలను ప్రాసెస్ చేశామని చెప్తున్నారు.

ఆయుర్ వస్త్ర పేరుతో సుగంధ ద్రవ్యాలతో చీరలు ... తయారీ ఇలా

ఆయుర్ వస్త్ర పేరుతో సుగంధ ద్రవ్యాలతో చీరలు ... తయారీ ఇలా

ఒక చీర తయారు చేయడానికి ఐదు నుండి ఆరు రోజులు పడుతుందని , దాల్చిన చెక్క ,లవంగాలు, నల్లమిరియాలు, యాలుకలు, జాపత్రి, బిర్యానీ ఆకు మొదలైన సహజ రోగనిరోధక శక్తిని పెంచే సుగంధద్రవ్యాలతో చీరలకు ఇమ్యూనిటీ బూస్టింగ్ చేస్తున్నామని అతను పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాలను చూర్ణంచేసి 48 గంటలకు పైగా నీటిలో నానబెట్టి, ఆ నీటిని బాగా మరిగిస్తూ ఆ ఆవిరిని చీరలకు పట్టిస్తామని, తద్వారా చీరలను ఇమ్యూనిటీ బూస్టర్ గా తయారు చేస్తామని చెప్తున్నారు. ఈ చీరలు ఐదు ఉతుకుల వరకు ఇమ్యూనిటీ బూస్టింగ్ కలిగి ఉంటాయని వారు చెబుతున్నారు.

వింతగా అనిపించినా సమయానికి తగ్గట్టు వ్యాపారం

వింతగా అనిపించినా సమయానికి తగ్గట్టు వ్యాపారం

మొత్తానికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి నేపథ్యంలో కరోనా రాకుండా ఉండడం కోసం వ్యాధినిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అని ప్రయత్నం చేస్తున్న వారికి ఇప్పటికే రక రకాల ప్రొడక్ట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటితో పాటు ఇమ్యూనిటీ బూస్టర్ గా చీరలు కూడా మార్కెట్లోకి రావడం ఒకింత వింతగా అనిపిస్తున్నా కరోనా మహమ్మారి బారిన పడకుండా వాటిని కూడా కొనుక్కుంటే పోలా! అన్న భావన చాలా మంది మహిళలకు కలగడం విశేషం . ఏది ఏమైనా కరోనా కాలంలో ప్రస్తుత ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అందుకు తగ్గట్టుగా చీరలు కూడా మార్కెట్లోకి రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది.

English summary
Due to corona immune-boosting drinks, tablets, snacks such as papadas but also freshly immune-boosting sarees have hit the market. Madhya Pradesh Handloom Corporation has launched 'Ayur Vastra' immunity boosting sarees in the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X