Son: యువకుడి తల నరికి ఎత్తుకుని వెళ్లిపోయారు, మొండెంతో సహ బైక్ కాల్చి బూడిద !
చెన్నై/ తిరువాణ్ణామలై: కిరాణా షాపు నిర్వహిస్తున్న తండ్రికి కొడుకు సహాయం చేస్తున్నాడు. తండ్రి త్వరగా ఇంటికి వెళ్లిపోతే కొడుకు షాపులో లెక్కలు చూసుకుని షాపుకు తాళం వేసి ఇంటికి వెలుతున్నాడు. సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లిపోవడంతో ఆయన కొడుకు షాపులో ఉన్నాడు. షాపు తాళం వేసుకుని బయలుదేరిన కొడుకు తల నరకి అతని మొండెం, బైక్ కాల్చి బూడిద చేశారు. యువకుడి తల ఎత్తుని హంతకులు పారిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. యువకుడిని హత్య చేసి రూ. 1 లక్ష డబ్బులు ఎత్తుకెళ్లారని యువకుడి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు.

తండ్రి కిరాణా షాపు
తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లాలోని వందవాసి సమీపంలోని నల్లూరులో ఏలుమై అనే ఆయన నివాసం ఉంటున్నాడు. చాలా సంవత్సరాల నుంచి ఎలుమై కిరాణా షాపు వ్యాపారం చేస్తున్నాడు ఏలుమైకి విజయ్ (21) అనే కుమారుడు ఉన్నాడు. కిరాణా షాపు నిర్వహిస్తున్న తండ్రి ఏలుమలైకి అతని కొడుకు విజయ్ సహాయం చేస్తున్నాడు.

తండ్రికి షాపులో సహాయం చేస్తున్న కొడుకు
తండ్రి ఏలుమలై త్వరగా ఇంటికి వెళ్లిపోతే అతని కొడుకు విజయ్ షాపులో లెక్కలు చూసుకుని షాపుకు తాళం వేసి ఇంటికి వెలుతున్నాడు. ఏలుమలై సాయంత్రం త్వరగా ఇంటికి వెళ్లిపోవడంతో ఆయన కొడుకు విజయ్ షాపులో ఉన్నాడు. రాత్రి షాపుకు తాళం వేసి బైక్ లో ఇంటికి వెలుతున్న విజయ్ ని కొందరు దారుణంగా హత్య చేశారు.

యువకుడి తల నరికి ఎత్తుకుని వెళ్లిపోయారు
విజయ్ తల పూర్తిగా నరికేసిన నిందితులు అతని మొండెం, బైక్ మీద పెట్రోల్ పోసి నిప్పంటించారు. విజయ్ తలను ఎత్తుకుని నిందితులు పరారైనారు. విజయ్ రాత్రి ఇంటికి రాకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు విజయ్ హత్యకు గురైన విషయం తెలిసింది. విజయ్ ని హత్య చేసి రూ. 1 లక్ష డబ్బులు ఎత్తుకెళ్లారని యువకుడి కుటుంబ సభ్యులు పోలీసు కేసు పెట్టారు. విజయ్ శరీరంలోని మొండెం మాత్రమే ఉందని, అతని తల కనపడటం లేదని, హత్యకు కచ్చితమైన కారాలు తెలీయడం లేదని, కేసు విచారణలో ఉందని పోలీసులు అంటున్నారు.