చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చెన్నై ఎయిర్ ఇండియా డింపుల్ కిడ్నాప్, ఫ్రెండ్ కింగ్ పిన్, మేనేజర్ కు రూ. 26 లక్షలు, ఏం జరిగిందంటే?!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఉద్యోగం పేరిట మోసానికి పాల్పడిన కేసులో చెన్నై ఎయిర్ పోర్టు మహిళా ఉద్యోగిని కిడ్నాప్ చెయ్యడం, కమిషనర్ కార్యాలయంలో ప్రత్యక్షం కావడంతో తమిళనాడు పోలీసులు విచారణ చేస్తున్నారు. ఉద్యోగం ఇప్పిస్తామని మహిళా, ఆమె స్నేహితుడు మోసం చేసి రూ. లక్షలు వసూలు చేశారని అనేక ఆరోపణలు రావడం, వసూలు చేసిన నగదులో రూ. 26 లక్షలు ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు కమిషన్ గా ఇచ్చామని మహిళా ఉద్యోగి పోలీసులకు చెప్పడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.

నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!నీ భార్య నాకు, నా భార్య నీకు, రాత్రి ఎంజాయ్ చేద్దాం రా, వ్యాపారవేత్తల కొత్త డీల్, బ్లాక్ మెయిల్!

చెన్నై ఎయిర్ ఇండియా

చెన్నై ఎయిర్ ఇండియా

తమిళనాడులోని తంజావూర్ జిల్లా, పేరాపురానికి చెందిన కాళిముత్తు కుమార్తె డింపుల్ (25) చెన్నై ఎయిర్ ఇండియా విమాన సంస్థ వాణిజ్య విభాగంలో ఉద్యోగం చేస్తున్నది. డింపుల్ కు ఎక్కువ మంది బందువులు, స్నేహితులు ఉన్నారు. డింపుల్ తో పాటు ఆమె కుటుంబ సభ్యుల మీద బందువులకు ఎంతో నమ్మకం ఉంది.

 విమాన సంస్థలో ఉద్యోగాలు

విమాన సంస్థలో ఉద్యోగాలు

తనకు తెలిసిన ప్రైవేటు విమాన సంస్థల్లో ఉద్యోగాలు ఇప్పిస్తానని చాల మంది దగ్గర డింపుల్ రూ. లక్షలు వసూలు చేసిందని ఆరోపణలు ఉన్నాయి. డబ్బులు ఇచ్చిన నిరుద్యోగులు ఎంతకాలానికి ఉద్యోగాలు రాకపోవడంతో డింపుల్ మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి చేశారని తెలిసింది.

డింపుల్ కిడ్నాప్

డింపుల్ కిడ్నాప్

సేలం స్టీల్ ప్లాంట్ సమీపంలోని నివాసం ఉంటున్న బంధువు సెబాస్టియన్ ను తన ఇంటికి రావాలని డింపుల్ చెప్పారు. ఆ సమయంలో డింపుల్ ఇంటికి వెళ్లిన బాధితులు ఆమెను కారులో కిడ్నాప్ చేసి నేరుగా పోలీసు కమిషనర్ కార్యాలయానికి తీసుకెళ్లారు. పోలీసులు డింపుల్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు.

మేనేజర్ ఓకే చెప్పారు

మేనేజర్ ఓకే చెప్పారు

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న డింపుల్ మీడియాలో మాట్లాడారు. తాను చెన్నై ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్నానని అన్నారు. తన స్నేహితుడైన విష్ణువాసన్ అలియాస్ విక్కి ఉద్యోగం ఇప్పించమని తనకు మనవి చేశాడని, తరువాత తాను ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు విషయం చెప్పానని, ఉద్యోగం ఇవ్వడానికి ఆయన ఓకే చెప్పారని డింపుల్ వివరించారు.

విక్కినే కింగ్ పిన్

విక్కినే కింగ్ పిన్

ఉద్యోగాలు ఇప్పిస్తామని అనేక మంది దగ్గర విష్ణువాసన్ అలియాస్ విక్కి రూ. లక్షలు వసూలు చేసుకున్నాడని తనకు తెలిసిందని, తరువాత అందులో తనకు కేవలం రూ. 26 లక్షలు మాత్రమే ఇచ్చాడని, ఆ నగదు తాను ప్రైవేటు విమాన సంస్థ మేనేజర్ కు ఇచ్చానని, తాను సొంత ఖర్చులకు ఆ డబ్బులు ఉపయోగించుకోలేదని డింపుల్ వివరించారు. స్టీల్ ప్లాంట్ పోలీసులు డింపుల్ నుంచి వివరణ తీసుకుని కేసును అనేక కోణాల్లో విచారణ చేస్తున్నారు. అయితే డింపుల్ వ్యవహారంతో ఎయిర్ పోర్టు ఉద్యోగులు హడలిపోయారు.

English summary
Chennai Airline female employee cheated case near salem and police inquiry is going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X