చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

టీటీవీ దినకరన్ సోదరి, బావకు జైలు శిక్ష: పీటీ వారెంట్ జారీ చేసిన సీబీఐ కోర్టు, అంతే!

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ మీద తిరుగుబాటు చేసి ఆర్ కే నగర్ శాసన సభ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన టీటీవీ దినకరన్ కుటుంబ సభ్యులకు మరో సమస్య ఎదురైయ్యింది. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో జైలు శిక్షపడినా లోంగిపోకుండా తిరుగుతున్న టీటీవీ దినకరన్ సోదరి, ఆమె భర్తను అరెస్టు చెయ్యాలని చెన్నై సీబీఐ ప్రత్యేక కోర్టు పీటీ వారెంట్ జారీ చేసింది.

అక్రమాస్తులు

అక్రమాస్తులు

టీటీవీ దినకరన్ సోదరి సీతలాదేవీ, ఆమె భర్త ఎస్ భాస్కరన్ (ఆర్ బీఐ భాస్కరన్) ఆదాయానికి మంచిన అక్రమాస్తులు సంపాధించారని 2008లో కేసు నమోదు అయ్యింది. అప్పట్లో సీతలాదేవీ, భాస్కరన్ లను అరెస్టు చేశారు. తరువాత ఇద్దరూ బెయిల్ మీద బయటకు వచ్చారు.

ఐదేళ్లు జైలు శిక్ష

ఐదేళ్లు జైలు శిక్ష

సీబీఐ కోర్టు విచారణలో సీబీఐ అధికారులు సీతలాదేవీ, భాస్కరన్ లు ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని ఆధారాలతో సహా నిరూపించారు. నేరం చేశారని వెలుగు చూడటంతో ఇటీవల సీబీఐ కోర్టు సీతలాదేవికి మూడేళ్లు, భాస్కరన్‌కు ఐదు సంవత్సరాల జైలు శిక్షవిధించింది.

పై కోర్టులో అప్పీలు

పై కోర్టులో అప్పీలు

సీబీఐ కోర్టు తీర్పుపై సీతలాదేవీ, భాస్కరన్ లు ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకున్నారు. తాము ఏనేరం చెయ్యలేదని, చట్టపరంగానే ఆస్తులు కొనుగోలు చేశామని, అనవసరంగా కేసులో ఇరికించారని కోర్టులో మనవి చేశారు.

సీబీఐ అధికారులు

సీబీఐ అధికారులు


సీతలాదేవీ, భాస్కరన్ లు ఆదాయానికి మించిన అక్రమాస్తులు సంపాధించారని నిరూపించే సాక్షాలను సీబీఐ అధికారులు ఉన్నత న్యాయస్థానంలో సమర్పించారు. ఆధారాలు పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం సీబీఐ కోర్టు విధించిన శిక్షను ఖరారు చెయ్యడంతో సీతలాదేవీ, భాస్కరన్ లకు చుక్కెదురు అయ్యింది.

కోర్టు చాన్స్ ఇచ్చినా !

కోర్టు చాన్స్ ఇచ్చినా !


సీతలాదేవీ, భాస్కరన్ లు జైల్లో శిక్ష అనుభవించేందుకు కోర్టులో లొంగిపోయేందుకు వారికి అవకాశం కల్పించారు. అయితే ఇంతవరకూ సీతలాదేవీ, భాస్కరన్ లు లోంగిపోకపోవడంతో చెన్నై సిబిఐ కోర్టు పిటీ వారెంట్‌ జారీ చేసింది. సీతలాదేవీ, భాస్కరన్ లను అరెస్టు చేసి జైలుకు పంపించాలని సిబిఐ కోర్టు పోలీసులను ఆదేశించింది.

English summary
Chennai CBI Court issues PT warrant TTV Dinakaran sister Sitala Devi and her husband Bhaskar.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X