చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేస్ బుక్ లవ్: భారీగా నగదు:‘ఆమె కాదు అతడు’అని తెలిసి నరికి చంపించిన పోలీసు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఫేస్‌ బుక్‌లో పరిచయమైన అమ్మాయిని గాఢంగా ప్రేమించిన కానిస్టేబుల్‌ ఆమె ప్రేమ కోసం భారీ మొత్తంలో నగదు బదిలి చేశాడు. అయితే అదొక ఫేస్ బుక్ ఫేక్‌ అకౌంట్‌ అని, ఒక అబ్బాయి అమ్మాయిలాగా నటించి మోసం చేశాడని తెలుసుకున్న ఆ కానిస్టేబుల్ రగిలిపోయాడు. చివరికి అమ్మాయి పేరుతో మోసం చేసిన యువకుడిని స్నేహితులతో నరికి చంపించిన ఘటన తమిళనాడులోని విరూద్ నగర జిల్లాలో జరిగింది.

కానిస్టేబుల్ కహాని

కానిస్టేబుల్ కహాని

విరూద్ నగర్ జిల్లా వథిరాయిరుప్పు నివాసి కణ్ణన్ కుమార్ (31) చెన్నై నగరంలోని ఎన్నూరు పోలీస్ స్టేషన్ లో 2016 నుంచి కానిస్టేబుల్ గా పని చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం విరూద్ నగర్ జిల్లా పుదుపట్టికి చెందిన అయ్యనార్ (22) అనేయువకుడు కణ్ణన్ కుమార్ కు నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లో అమ్మాయి పేరుతో పరిచయం అయ్యాడు.

బీఈడీ విద్యార్థి

బీఈడీ విద్యార్థి

అయ్యనార్ బీఈడీ విద్యాభ్యాసం చేస్తున్నాడు. నకిలి ఫేస్ బుక్ అకౌంట్ లో అందమైన అమ్మాయి ఫోటో పెట్టి కణ్ణన్ కుమార్ తో ప్రేమ వ్యవహారం నడిపాడు. అలా ఇద్దరూ దగ్గర అయ్యారు. కానిస్టేబుల్ కణ్ణన్ కుమార్, బీఈడీ విద్యార్థి అయ్యనార్ ఫోన్ నెంబర్లు ఇచ్చిపుచ్చుకున్నారు.

అమ్మాయి గొంతుతో !

అమ్మాయి గొంతుతో !

అయ్యనార్ ఫోన్‌ లో మాట్లాడినప్పుడు అమ్మాయిలాగా గొంతు మార్చి కణ్ణన్ కుమార్ ను మాయ చేశాడు. ఇలా కణ్ణన్ కుమార్ దగ్గర భారీ మొత్తంలో నగదు లాగేశాడని తెలిసింది. విచిత్రం ఏమిటంటే కానిస్టేబుల్ కణ్ణన్ కుమార్, అయ్యనార్ ల గ్రమాల మధ్య కేవలం 5 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది.

సంక్రాంతి సెలవులు

సంక్రాంతి సెలవులు

సంక్రాంతి పండగ సందర్బంగా కణ్ణన్ కుమార్ 10 రోజులు సెలవు తీసుకుని తన ప్రియురాలిని చూడాలని ఆత్రుతగా సొంత ఊరికి వెళ్లాడు. ప్రియురాలి ఫోన్ నెంబర్ కు ఫోన్ చేసి తనను కలవాలని చెప్పాడు. అయితే అసలు విషయం బయటపడుతుందని అయ్యనార్ కలవడానికి నిరాకరించాడు.

అమ్మాయి కాదు అబ్బాయి

అమ్మాయి కాదు అబ్బాయి

ఐదు కిలో మీటర్ల దూరంలో ఉండికూడా కలవడానికి ప్రియురాలు నిరాకరించడంతో కణ్ణన్‌ కుమార్ కు అనుమానం మొదలైంది. అనేక కోణాల్లో ఆలోచించిన కణ్ణన్ కుమార్ ఇంత కాలం తాను అమ్మాయితో కాదు అబ్బాయితో మాట్లాడానని, పూర్తిగా మోసపోయానని గుర్తించి ఆవేదన చెందాడు.

పోలీసు ఆత్మహత్యాయత్నం

పోలీసు ఆత్మహత్యాయత్నం

పోలీసు అయ్యికూడా తాను మోసపోయానని జీవితంపై విరక్తి చెందిన కణ్ణన్ కుమార్ పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నంచేశాడు. వెంటనే కణ్ణన్ కుమార్ ను కుటుంబ సభ్యులు విరూద్ నగర్ లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

స్నేహితులు

స్నేహితులు

కణ్ణన్ కుమార్ ఆత్మహత్యాయత్నం చేశాడని తెలుసుకున్న అతని స్నేహితులు తమిళరసన్, తజింగ్, విజయ్ కుమార్ ఆసుపత్రికి వెళ్లారు. కణ్ణన్ కుమార్ జరిగిన విషయం మొత్తం చెప్పారు. నిన్ను అమ్మాయి పేరుతో మోసం చేసిన అయ్యనార్ ను దారుణంగా హత్య చేస్తామని స్నేహితులు చెప్పారు. అతన్ని హత్య చేస్తే కేసు లేకుండా తాను కాపాడుతానని కణ్ణన్ కుమార్ స్నేహితులకు హామీ ఇచ్చాడు.

నరికి చంపేశారు

నరికి చంపేశారు

పక్కా ప్లాన్ ప్రకారం అయ్యానార్ ను నిర్జనప్రదేశంలోకి పిలిపించిన తమిళరసన్, తజింగ్, విజయ్ కుమార్ అతన్ని దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు అయ్యనార్ మొబైల్ ఫోన్ నెంబర్ల ఆధారంగా తమిళరసన్, తజింగ్, విజయ్ కుమార్ ను అరెస్టు చేశారు.

పోలీసు పరార్ !

పోలీసు పరార్ !

స్నేహితులను అరెస్టు చేశారని తెలుసుకున్న కానిస్టేబుల్ కణ్ణన్ కుమార్ ఆసుపత్రి నుంచి పరారైనాడని, అతని కోసం గాలిస్తున్నామని విరూద్ నగర్ జిల్లా ఎస్పీ ఎం. రాజరాజన్ చెప్పారు. కణ్ణన్ కుమార్ ఫోన్ నెంబర్ కూడా స్విచ్ ఆఫ్ రావడంతో అతని ఫోటోను తమిళనాడులోని అన్ని పోలీస్ స్టేషన్ కు పంపించామని ఎస్పీ రాజరాజన్ తెలిపారు.

English summary
Someone forgot to tell this cop not to take everything on social media to heart. Investigators said a 32-year-old constable with the Ennore police in Chennai and three accomplices hacked to death a 22-year-old man in Pudupatti in Virudhunagar district, following the policeman's discovery that the victim had posed as a woman on Facebook to con him of large sums of money.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X