చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జయలలిత దత్తపుత్రుడికి కోర్టు వారెంట్: ఇప్పటికే బెంగళూరు జైల్లో, మరో షాక్ !

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి దత్తపుత్రుడు (మాజీ) సుధాకరన్ కు చెన్నైలోని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసింది. కేసు విచారణకు సుధాకరన్ ను తమ ముందు హాజరుపరచాలని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి దత్తపుత్రుడు (మాజీ) సుధాకరన్ కు చెన్నైలోని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు వారెంట్లు జారీ చేసింది. కేసు విచారణకు సుధాకరన్ ను తమ ముందు హాజరుపరచాలని ఎగ్మూరు ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి చెన్నై పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు.

జయలలిత అక్రమాస్తుల కేసులో శశికళ, ఆమె వదిన ఇళవరసి, ఆమె సమీప బంధువు సుధాకరన్ బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. జయ టీవీ కోసం నియమాలు ఉల్లంఘించి విదేశాల నుంచి విలువైన కొన్ని పరికరాలు తెప్పించారని కేసు నమోదు అయ్యింది.

Chennai egmore court issues warrant to produce Sasikala's relative Sudhakaran

విదేశాలతో అక్రమ నగదు లావాదేవీలు నిర్వహించారని ఈడీ అధికారులు కొన్ని ఏళ్ల క్రితం కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే టీటీవీ దినకరన్, ఆయన సోదరుడు టీటీవీ భాస్కరన్ విచారణ ఎదుర్కొంటున్నారు. కోర్టు అనుమతి ఇవ్వడంతో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్న శశికళను వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా విచారించాలని అధికారులు సిద్దం అయ్యారు.

ఇప్పుడు ఈ కేసులో తాజాగా సుధాకరన్ ను విచారించాలని ఎగ్మూరు కోర్టు నిర్ణయించింది. ఫెరా కేసు విచారణ తుదిదశకు చేరుకోవడంతో ఇప్పుడు శశికళ కుటుంబ సభ్యులను విచారించి పూర్తి వివరాలు సేకరించాలని అధికారులు కోర్టులో మనవి చేశారు.

English summary
Chennai egmore court issues warrant to produce Sasikala's relative Sudhakaran who is imprisoned in jail for Jaya assets case for the hearing of JJ tv equipments fraud case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X