చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జైల్లో శశికళకు వందనాలు: తమిళనాడు సీఎంతో సహ మంత్రులకు నోటీసులు ఇచ్చిన హైకోర్టు!

|
Google Oneindia TeluguNews

చెన్నై: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న అన్నాడీఎంకే పార్టీ (అమ్మ) తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళను ప్రసన్నం చేసుకోవడానికి పాకులాడిన మంత్రులకు చుక్కెదురైయ్యింది.

శశికళ అక్రమాస్తుల కేసు: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి, జయలలిత కేసులో!శశికళ అక్రమాస్తుల కేసు: విచారణ నుంచి తప్పుకున్న సుప్రీం కోర్టు జడ్జి, జయలలిత కేసులో!

న్యాయస్థానం శశికళ నేరం చేశారని గుర్తించి శిక్ష అమలు చేసిందని, అలాంటి శశికళను జైల్లో మీరు ఎందుకు కలిశారు ? అని సమాధానం చెప్పాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మద్రాసు హైకోర్టు మదురై డివిజన్ బెంచ్ గురువారం నోటీసులు జారీ చేసింది.

Chennai HC Madurai branch issues notice TN CM his 4 ministers

తమిళనాడులో ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మీరు పొరుగు రాష్ట్రంలో కర్ణాటకలోని సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న శశికళను ఎందుకు కలిశారు ? అంత అవసరం ఏమి వచ్చింది అంటూ సమాధానం చెప్పాలని ఎడప్పాడి పళనిసామితో సహ నలుగురు మంత్రులకు మదురై డివిజన్ బెంచ్ నోటీసులు జారీ చేసింది.

తమిళనాడు సీఎం స్ట్రైల్ మారింది, పాదాబివందనం, మళ్లీ జయలలిత స్ట్రైల్ లోనే!తమిళనాడు సీఎం స్ట్రైల్ మారింది, పాదాబివందనం, మళ్లీ జయలలిత స్ట్రైల్ లోనే!

ఈ దెబ్బతో సెంట్రల్ జైల్లో శశికళను కలిసిన మంత్రులు హడలిపోయారు. ఇప్పుడు న్యాయస్థానంలో ప్రభుత్వం ఏమి సమాధానం ఇస్తుందో ? అంటూ తమిళనాడు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తమిళనాడు ప్రజల సమస్యలు పట్టించుకోకుండా చెన్నై నుంచి బెంగళూరు చేరుకున్న మంత్రులు పదేపదే శశికళను కలిసిన విషయం తెలిసిందే.

English summary
Chennai HC Madurai Branch has issed a notice to CM Edappadi Palanisamy and 5 ministers who met a convicted Sasikala in the jail.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X